Hari Hara Veeramallu OTT: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) మోస్ట్ అవైటెడ్ మూవీ ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) చిత్రం భారీ అంచనాల నడుమ రీసెంట్ గానే విడుదలై మొదటి ఆట నుండే డివైడ్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మొదటి నుండి ఈ చిత్రం పై అభిమానుల్లో కూడా పెద్దగా అంచనాలు లేవు. కారణం ఈ సినిమా నుండి డైరెక్టర్ క్రిష్ తప్పుకోవడం వల్లే. క్రిష్ తర్వాత జ్యోతి కృష్ణ రంగం లోకి వచ్చాడు. ఇతని చరిత్ర చూస్తే నిల్. గతం లో ఇతను తీసిన సినిమాలన్నీ ఒక దానిని మించి ఒకటి ఫ్లాప్ అయ్యాయి. పైగా ఈ సినిమా అనేకసార్లు వాయిదా పడుతూ వచ్చి, పవన్ కళ్యాణ్ క్రేజీ చిత్రం ఓజీ కి సరిగ్గా రెండు నెలల ముందుకు వచ్చి ఆగింది. అసలే విపరీతమైన క్రేజ్ ఉన్న సినిమా కి అతి దగ్గర్లో ఒక పాత బడిన సినిమా వస్తే ఎవరు పట్టించుకుంటారు చెప్పండి.
Also Read: ‘హరి హర వీరమల్లు’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు..60 శాతం రీకవరీ!
ఈ సినిమాకు కూడా అదే జరిగింది. అభిమానులు ఓజీ మత్తులో ఉన్నప్పటికీ కూడా, ప్రీమియర్ షోస్ కి ఎంత భారీ టికెట్ రేట్ పెట్టిన ఎగబడి కొని వెళ్లారు. అలా ఆశతో వచ్చిన అభిమానులు నిరాశతో ఇంటికి తిరిగి వెళ్లారు. దీంతో వారం రోజులకే అనేక ప్రాంతాల్లో కలెక్షన్స్ డౌన్ అయిపోయాయి. మహా అయితే ఈ వీకెండ్ వరకు కాస్త డీసెంట్ వసూళ్లను నమోదు చేసుకోవచ్చు ఏమో కానీ, లాంగ్ రన్ లో వసూళ్లు రావడం ఇక కష్టమే. అయితే ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్(Amazon Prime Video) సంస్థ భారీ రేట్ కి కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. నిర్మాత AM రత్నం హిందీ తప్ప, మిగిలిన అన్ని భాషలకు సంబంధించిన రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ కి విక్రయించాడు. ఒప్పందం ప్రకారం నాలుగు వారాల తర్వాత ఓటీటీ లో విడుదల చెయ్యాలి.
అంటే ఆగస్టు 24 లేదా అంతకంటే ముందే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతుంది అన్నమాట. అయితే మేకర్స్ ఈ వారం లో హిందీ వెర్షన్ ని విడుదల చేయబోతున్నారు. ఒకవేళ హిందీ లో మంచి రెస్పాన్స్ వచ్చి, డీసెంట్ స్థాయి ఓపెనింగ్స్ ని సాధిస్తే మాత్రం, ఈ చిత్రం ఓటీటీ విడుదల మరో రెండు వారాలు వాయిదా పడే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి అయితే ఆగష్టు 20 నుండి 24 మధ్యలో కచ్చితంగా స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. థియేటర్స్ లో పెద్దగా రెస్పాన్స్ ని సొంతం చేసుకోలేకపోయిన ఈ సినిమా, కనీసం ఓటీటీ ఆడియన్స్ ని అయినా అలరిస్తుందో లేదో చూడాలి.
Also Read: రాజాసాబ్ సెట్ లో ప్రభాస్ కు ఊపిరి అందించేందుకు మూవీ టీం ఏం చేసిందంటే!