Pawan Kalyan OG Movie Update: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న ఓజి సినిమా అప్డేట్ గురించి చాలామంది పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియాలో విపరీతంగా కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ సినిమా సెప్టెంబర్ 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో సినిమాకు సంబంధించిన ట్రైలర్ ని ఎప్పుడు రిలీజ్ చేస్తారు అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో పెద్ద వారైతే జరుగుతోంది. మరి సుజిత్ ఈ విషయం మీద స్పందిస్తే బాగుంటుంది అంటూ మరి కొంతమంది పవన్ కళ్యాణ్ అభిమానులు సైతం వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి హరిహర వీరమల్లు సినిమా వచ్చినప్పటికి పవన్ కళ్యాణ్ అభిమానులు ఆ సినిమాతో పెద్దగా సంతృప్తి అయితే పొందలేదు. కాబట్టి ఇప్పుడు ఓజీ సినిమా వస్తే అది చూసి దానిని సూపర్ సక్సెస్ చేయాలని అభిమానులు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరి ఈ సినిమా మీద పవన్ కళ్యాణ్ కి కూడా చాలావరకు హోప్స్ అయితే ఉన్నాయి. అతను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో ప్రేక్షకులను మెప్పిస్తాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.
Also Read: ‘హరి హర వీరమల్లు’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు..60 శాతం రీకవరీ!
మరి మొత్తానికైతే ఈ సినిమా ట్రైలర్ ను ఆగస్టు 2 వ తేదీన రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ భారీ విజయాన్ని సాధిస్తే ఆయనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న వాడవుతాడు. లేకపోతే మాత్రం పవన్ కళ్యాణ్ మరోసారి తన అభిమానులను నిరాశపరిచిన వాడవుతాడు. ఓజీ సినిమా మీద సైతం భారీ అంచనాలతో ఉన్నాడు.
సినిమా విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చాలా బాగా తీర్చిదిద్ది మరి సినిమాని అభిమానులకు నచ్చే విధంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నాడు. మరి అతను అనుకున్నట్టుగానే ఔట్ పుట్ వచ్చిందట. దానికి తగ్గట్టుగా ఆర్ఆర్ లను ఆడ్ చేసి సినిమాని జనాల మీదికి వదిలితే భారీ సక్సెస్ ని సాధిస్తుందనే ఉద్దేశ్యంతో ఉన్నట్టుగా తెలుస్తోంది.
ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన కూడా పవన్ కళ్యాణ్ చేసిన సినిమాలు అతనికి గొప్ప గుర్తింపును సంపాదించి పెట్టాయి. మరి ఈ మధ్యకాలంలో ఆయనకు సరైన సక్సెస్ అయితే పడటం లేదు. కాబట్టి ఓజీ సినిమా మీదనే చాలా అంచనాలైతే ఉన్నాయి…ఇక ఇప్పుడున్న హీరోలందరు పాన్ ఇండియా హీరోలు అవ్వడం వల్ల పవన్ కళ్యాణ్ అభిమానులు సైతం తమ హీరో చేస్తున్న సినిమా పాన్ ఇండియాలో పెను సంచలనాలను క్రియేట్ చేస్తే చూడాలని వెయిట్ చేస్తున్నారు…