అండమాన్, నికోబార్ లో బ్యాంక్ మోసాలు

– Advertisement –

కేంద్ర పాలిత ప్రాాంతమైన అండమాన్ నికోబార్ దీవుల్లో సహకార బ్యాంకు రుణాలకు సంబంధించిన మోసాలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. ఒక మాజీ ఎంపీకి సంబంధించి మనీలాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ తొలిసారిగా సోదాలు నిర్వహించింది. ఈ కేసు అండమాన్,నికోబార్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ (ఎఎన్‌ఎస్ సిబి)కి, దాని వైస్ చైర్మన్ కుల్దీప్ రాయ్ శర్మకు సంబంధించినది. కాంగ్రెస్ నాయకుడైన కుల్దీప్ రాయ్ శర్మ కేంద్ర ప్రాలిత ప్రాంతం తరుపున ఎన్నికై 2019- 2024 మధ్య పార్లమెంటు సభ్యుడుగా ఉన్నారు. మనీలండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్ ఏ) కింద ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు పోర్ట్ బ్లేయర్ లోనూ, దాని చుట్టుపక్కల 9 ప్రదేశాలలో, కోల్ కతాలో రెండు ప్రదేశాలలో దాడులు నిర్వహించారు.

అండమాన్ నికోబార్ సహకార బ్యాంక్ రుణాలు, ఓవర్ డ్రాఫ్ట్ ల మంజూరు లో పెద్దఎత్తున అవకతవకలు జరిగాయని తెలిపే
పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. అండమాన్, నికోబార్ దీవులలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సోదాలు చేపట్టడం ఇదే తొలిపారి. మాజీ ఎంపీ కుల్దీప్ రాయ్ శర్మ, ఆయన అనుచరులు సృష్టించిన 15 కంపెనీలు దాదాపు 200 కోట్ల రూపాయలకు పైగా రుణాలను మోసపూరితంగా తీసుకున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. అండమాన్, నికోబార్ పోలీస్ క్రైమ్, ఎకనమిక్ అఫెన్సెస్ వింగ్ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈ మనీలాండరింగ్ కేసు నమోదయింది.

– Advertisement –

Leave a Comment