Vellampalli Srinivas Joining BJP: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీకి వరుస ఎదురు దెబ్బలు తప్పడం లేదు. ఆ పార్టీ ఓడిపోయిన తర్వాత చాలామంది నేతలు గుడ్ బై చెప్పారు. కూటమి పార్టీల్లో చేరారు. మరోవైపు కూటమి ప్రభుత్వం కేసులతో వెంటాడుతోంది. దీంతో కొంతమంది నేతలు సైలెంట్ అయ్యారు. మరికొందరు సొంత వ్యాపారాల్లో నిమగ్నమయ్యారు. మద్యం కుంభకోణం కేసులో ఇప్పటికే 12 మంది అరెస్టు అయ్యారు. రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి అరెస్టు జరిగింది. తదుపరి అరెస్టు జగన్మోహన్ రెడ్డి దేనిని ప్రచారం నడుస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు చాలా ఆందోళనతో ఉన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో కొంతమంది పక్క చూపులు చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. విజయవాడకు చెందిన ఓ మాజీ మంత్రి ఏకంగా బిజెపిలోకి వెళ్లేందుకు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. పూర్వాశ్రమంలో స్నేహితులైన నేతల ద్వారా బిజెపిలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు సమాచారం. అదే కానీ జరిగితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దారుణ దెబ్బ పడటం ఖాయం.
ఓటమి నుంచి ఫుల్ సైలెన్స్
మొన్నటి ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ( Vijayawada West ) నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు వెల్లంపల్లి శ్రీనివాస్. కానీ ఆయన బిజెపి అభ్యర్థి సుజనా చౌదరి చేతిలో ఓడిపోయారు. అయితే ఓటమి నాటి నుంచి ఆయనలో ఒక రకమైన మార్పు కనిపిస్తోంది. వైసిపి హయాంలో దూకుడుగా వ్యవహరించినందున కూటమికి తప్పకుండా టార్గెట్ అవుతానని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే బిజెపిలో చేరేందుకు ఆయన ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు విజయవాడ పొలిటికల్ సర్కిల్లో ప్రచారం జరుగుతోంది. గతంలో బిజెపిలో పని చేసిన సమయంలో పివిఎన్ మాధవ్ మంచి స్నేహితుడు. ప్రస్తుతం ఏపీ బీజేపీ అధ్యక్షుడు కావడంతో.. వెల్లంపల్లి ఆయన ద్వారా ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. హైదరాబాదులో ఇద్దరి చర్చలు పూర్తయ్యాయని.. వెల్లంపల్లి బిజెపిలోకి వెళ్లడం ఖాయమని పొలిటికల్ సర్కిల్లో ప్రచారం అయితే మాత్రం జరుగుతోంది.
Also Read: జగన్ అరెస్ట్ తప్పదా..? వైసీపీ పగ్గాలు ఆయనకే?!
పిఆర్పి ద్వారా ఎంట్రీ..
ప్రజారాజ్యం పార్టీ( Praja Rajyam party) ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు వెల్లంపల్లి శ్రీనివాస్. 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం బిజెపిలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా మరోసారి పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. కానీ ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. 2016లో వైసీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. జగన్ క్యాబినెట్లో మంత్రి అయ్యారు. అయితే ఈ ఎన్నికల్లో ఓటమితో ఫుల్ సైలెన్స్ పాటిస్తున్నారు. మునుపటి మాదిరిగా వైసిపి లో యాక్టివ్ గా లేరు. అందుకే బిజెపిలో చేరతారని ప్రచారం సాగుతోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.