Sambasiva Rao Advice to Jagan: జగన్ కు TV5 సాంబశివరావు సలహా.. ఓ రేంజ్ లో ట్రోల్స్

Sambasiva Rao Advice to Jagan: మద్యం కుంభకోణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం వేగంగా అడుగులు వేస్తోంది. ఈ కేసులో లోతుగా దర్యాప్తు జరుపుతోంది. వేల కోట్ల కుంభకోణం జరిగిందని ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు సంస్థ నిర్ధారించింది. పార్లమెంట్ సభ్యుడు మిథున్ రెడ్డి నుంచి మొదలు పెడితే కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి వరకు అరెస్టులు చేసింది. ఈ కేసు వ్యవహారం ఇంకా ఎంతవరకు వెళుతుందో తెలియదు. కాకపోతే కూటమి అనుకూల మీడియా మాత్రం ఈ వ్యవహారానికి సంబంధించి రోజుకో తీరుగా వార్త కథనాలను ప్రసారం చేస్తోంది.

Also Read: సేఫ్ జోన్ లోకి ఆ మంత్రులు.. తెగ కష్టపడుతున్నారే!

కూటమి అనుకూల మీడియాగా పేరుపొందిన టివి5లో ఒక వార్త కథనం ప్రసారమైంది. ఇందులో సీనియర్ జర్నలిస్ట్ సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ మద్యం కుంభకోణం లో జగన్మోహన్ రెడ్డిని కనక ఏపీ పోలీసులు అరెస్టు చేస్తే.. తనతో పాటు పదిమంది ఎమ్మెల్యేలు, నలుగురు ఎంపీలు రాజీనామా చేయాలని సూచించారట.. తద్వారా ఉప ఎన్నికలు రావాలని.. ఆ ఎన్నికల్లో గెలవాలని.. అలా గెలిచి కూటమి ప్రభుత్వానికి చెంప పెట్టు లాంటి సమాధానం ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి భావించారట. ఇదే విషయాన్ని సాంబశివరావు ప్రస్తావించారు. అంతేకాదు ఈ విషయాన్ని చెప్పుకుంటూ నే… జగన్మోహన్ రెడ్డికి సాంబశివరావు ఒక సలహా ఇచ్చారు.. ఎట్టి పరిస్థితుల్లో ఉప ఎన్నికలకు వెళ్ళద్దని.. అలా చేస్తే వైసిపికి నష్టం జరుగుతుందని సాంబశివరావు వ్యాఖ్యానించారు.

మద్యం కుంభకోణంలో అరెస్టై జైలుకు వెళ్లిన ఢిల్లీ ఒకప్పటి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ఎన్నికల్లో ఓడిపోయారని.. అధికారాన్ని కూడా దూరం చేసుకున్నారని.. భారత రాష్ట్ర సమితి శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్ట్ కావడం వల్ల.. ఆమె పార్టీ పార్లమెంటు ఎన్నికల్లో 0 సీట్లు సాధించిందని.. జగన్ కూడా మద్యం వ్యవహారంలో అభియోగాలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో.. ఒకవేళ ఉప ఎన్నికలకు వెళ్తే.. ఆయనకు కూడా అదే పరిస్థితి ఎదురవుతుందని సాంబశివరావు పేర్కొన్నారు.

Also Read:  జగన్ అరెస్ట్ తప్పదా..? వైసీపీ పగ్గాలు ఆయనకే?!

సాంబశివరావు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో వైసిపి సానుభూతిపరులు, వైసిపి నాయకులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. సాంబశివరావు పై రాయడానికి వీలు లేని భాషలో విమర్శలు చేస్తున్నారు. అడ్డగోలుగా బూతులు ప్రయోగిస్తున్నారు. మా పార్టీ సంగతి మాకు తెలుసు.. మధ్యలో నీ సలహాలు మాకు ఎందుకు.. అన్నట్టుగా వైసీపీ సానుభూతిపరులు, వైసీపీ కార్యకర్తలు విమర్శలు చేస్తున్నారు. నీ సంగతి నువ్వు చూసుకో అన్నట్టుగా సాంబశివరావుకు సలహా ఇస్తున్నారు. మొత్తానికి సాంబశివరావు చేసిన వ్యాఖ్యల సంబంధించిన వీడియోను వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.

Leave a Comment