Penugonda Railway Station: సాధారణంగా రాయలసీమలో( Rayalaseema ) రైల్వే స్టేషన్లలో కార్లు కనిపిస్తే.. సినిమా షూటింగ్ అని అంతా భావిస్తారు. షూటింగ్ కోసమే అలా కార్లు తెచ్చి ఉంటారని ఎక్కువమంది అంచనా వేస్తుంటారు. అయితే రాయలసీమలో ఓ రైల్వే స్టేషన్ లో మాత్రం నిత్యం వందలాది కార్లు కనిపిస్తుంటాయి. ఒకదాని వెనుక మరొకటి బారులుదీరి కనిపిస్తాయి. అయితే కొత్తవారికి వింతే కానీ.. స్థానికులకు మాత్రం అసలు విషయం తెలుసు. అయితే ఈరోజు కనిపించే కార్లు రేపు కనిపించవు. మళ్లీ కొత్త కొత్త కార్లు అక్కడ పెడుతుంటారు. ఎంతకీ ఏదా స్టేషన్? ఏంటా కథ అంటే? శ్రీ సత్య సాయి జిల్లా పెనుకొండ రైల్వే స్టేషన్ ఇలా కార్ల హబ్ గా మారిపోయింది. దానికి కారణం అక్కడ కియా కార్ల పరిశ్రమ ఉండడమే. ఈ పరిశ్రమ పుణ్యమా అని పెనుగొండ రైల్వే స్టేషన్ కు ఎనలేని ప్రాధాన్యం దక్కుతోంది. అక్కడ తయారైన కార్లను గూడ్స్ రైళ్ల ద్వారా దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఐ వి సి లాజిస్టిక్స్ సంస్థ డబుల్ డెక్కర్ రైలు ద్వారా ఈ కార్లను తరలిస్తోంది. దీంతో ఇలా నిత్యం పెనుగొండ రైల్వే స్టేషన్ లో సరికొత్త కార్లు కనిపిస్తుంటాయి అన్నమాట.
Read Also: జగన్ కూడా.. నారాలోకేష్ ని ఫాలో అవుతున్నాడా?
దేశవ్యాప్తంగా రవాణా..
పెనుకొండ సమీపంలో కియా ఇండియా ప్లాంట్( Kia India Plant ) ఉంది. ఇక్కడ వందలాదిగా కార్లు తయారవుతుంటాయి. దేశవ్యాప్తంగా రవాణా ఉంటుంది ఇక్కడి నుంచి. ప్రపంచవ్యాప్తంగా కియాకార్లకు మంచి డిమాండ్ ఉంది. పెనుగొండ పరిశ్రమ నుంచి మన దేశానికి సంబంధించి ఎక్కువగా కార్లు ఎగుమతి అవుతాయి. ఐ వి సి లాజిస్టిక్స్ అనే సంస్థ డబుల్ డెక్కర్ రైలు ద్వారా రైల్వే స్టేషన్ నుంచి ఎగుమతి చేస్తుంది. ఈ రైలు గురుగ్రామ్ నుంచి వచ్చే సమయంలో మారుతీ కార్లను లోడ్ చేసుకుని తీసుకొస్తుంది. తిరుగు ప్రయాణంలో వెళ్లేటప్పుడు ఆ రైలు మళ్లీ పెనుగొండలో కియా కార్లను తీసుకుని వెళ్తోంది. అయితే ఈ రైలు వచ్చే సమయానికి పెనుగొండ రైల్వే స్టేషన్ లో వందలాది కార్లను ఇలా బయట పెడుతుంటారు అన్నమాట. మొత్తం మీద కియా ఫ్యాక్టరీ కారణంగా పెనుగొండ రైల్వే స్టేషన్ లో సందడి వాతావరణం కనిపిస్తోంది.
Read Also: పెళ్లైన యువతి జీవితంతో ఆడుకున్న ప్రియుడు
2017 లో ఉత్పత్తి ప్రారంభం..
2014లో టిడిపి( Telugu Desam Party) అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది కియా కార్ల పరిశ్రమ. అయితే నాడు చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధతో అనంతపురం జిల్లాకు తీసుకొచ్చారు ఆ పరిశ్రమను. వేలాదిమందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ.. ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఆదాయాన్ని ఇస్తూ వస్తోంది ఈ పరిశ్రమ. 2017 లో ఇక్కడ కార్ల ఉత్పత్తి ప్రారంభం అయింది. క్రమేపి అది పెరుగుతూ వస్తోంది. అయితే నాడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కియా పరిశ్రమపై విషం చిమ్మారు. పరిశ్రమను రాష్ట్రం నుంచి తరిమేస్తామని హెచ్చరించారు. కేవలం చంద్రబాబు తీసుకొచ్చారన్న అక్కసుతోనే అప్పట్లో అలా చేశారు. ఇప్పుడు అదే పరిశ్రమ దేశంలోనే గుర్తింపు సాధించింది. ప్రస్తుతం 10 లక్షలకు పైగా ఉత్పత్తులతో దూసుకుపోతోంది. దేశవ్యాప్తంగా కియా కార్ల అమ్మకాలు కూడా గణనీయంగా పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. మొత్తానికి అయితే చంద్రబాబు పుణ్యమా అని ఆ పరిశ్రమ బాగానే నిలదొక్కుకుంది.