MLC Nagababu Janasena Meeting: ‘పని చెయ్ ఫలితం ఆశించకు’ కమెడియన్ కృష్ణ భగవాన్( Krishna bhagwan) చెప్పే డైలాగు ఇది. ఇప్పుడు అక్షరాలా జనసేన పార్టీకి అతికినట్టు సరిపోతుంది. ఏపీలో జనసేన కూటమి కట్టింది. టిడిపి తో కలిసి పనిచేసింది. కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఇప్పుడు జనసైనికులు అధికారంతోపాటు కొన్ని రకాల హక్కులపై ప్రశ్నిస్తున్నారు. అయితే సర్దుబాటుతో పనిచేసుకోవాల్సిందేనని నాయకత్వం తేల్చి చెబుతోంది. తాజాగా విశాఖలో జనసైనికులకు ఇదే పరిస్థితి ఎదురయింది. జనసేనకు చెందిన ఎమ్మెల్సీ నాగబాబు విశాఖలో పర్యటించారు. పార్టీ శ్రేణులతో సమావేశం అయ్యారు. వారి సమస్యలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో నాగబాబు చేసిన కామెంట్స్ తో జనసైనికులు హర్ట్ అయ్యారు.
Also Read: సేఫ్ జోన్ లోకి ఆ మంత్రులు.. తెగ కష్టపడుతున్నారే!
బాధను చెప్పుకుందామంటే..
సాధారణంగా ఎమ్మెల్సీ నాగబాబు( MLC Nagababu) అంటే పవన్ కళ్యాణ్ తర్వాత ఆయనే అన్నట్టు పరిస్థితి ఉంది. పైగా నాగబాబు వద్ద స్వేచ్ఛగా పార్టీ పరిస్థితులు మాట్లాడుకోవచ్చని ఎక్కువమంది భావించారు. అయితే ఓ వార్డు మహిళా అధ్యక్షురాలు తన ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన కిందిస్థాయి కార్యకర్తలు చాలా ఆవేదనతో ఉన్నారని.. పనులు జరగకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందుతున్నారని.. దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. అయితే వెంటనే పార్టీ శ్రేణులు ఆమె మైక్ ను కట్ చేశాయి. దీంతో ఒక్కసారిగా ఆవేదనకు గురయ్యారు సదరు మహిళా నేత. జనసేనకు చెందిన ఓ కార్పొరేటర్ భర్త కూడా ఇదే తరహా వ్యాఖ్యానాలు చేయగా.. నాగబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టముంటే ఉండండి లేకపోతే వెళ్ళిపోండి అన్నట్లు మాట్లాడారు. కూటమితో సమన్వయంగా ముందుకు సాగాల్సిందేనని తేల్చి చెప్పారు. దీంతో సదరు నేత మనస్థాపానికి గురయ్యారు.
Also Read: జగన్ అరెస్ట్ తప్పదా..? వైసీపీ పగ్గాలు ఆయనకే?!
మరోసారి వైసీపీకి ఛాన్స్ లేకుండా..
ఏపీలో మరోసారి వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress party ) పార్టీ అధికారంలోకి రాకూడదు అన్నది పవన్ కళ్యాణ్ అభిప్రాయం. అది కూటమి బలంగా ఉంటేనే సాధ్యపడుతుందని ఆయన నమ్ముతున్నారు. కూటమిలో విభేదాలు తేవడానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తుందని కూడా అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎవరైనా కూటమికి విఘాతం కలిగించే మాట్లాడితే ఒప్పుకోవడం లేదు. ఇప్పటికే చాలామంది జనసేన ఇన్చార్జిలపై కూడా వేటు వేశారు. కూటమితో సమన్వయంగా సాగితేనే పార్టీలో ఉండండి.. లేకపోతే మీ ఇష్టం అంటూ కూడా తేల్చి చెప్తున్నారు. అయితే ప్రస్తుతం నాగబాబు విశాఖ పర్యటనలో కూడా అదే విషయంపై స్పష్టత ఇస్తున్నారు. వ్యక్తిగతంగా వెళ్లకండని.. కూటమి ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేయండి అంటూ పార్టీ శ్రేణులకు పిలుపు ఇస్తున్నారు. దీంతో సమస్యలు చెప్పుకోవడానికి ముందుకు వస్తున్న జన సైనికులు తీవ్ర ఆవేదనతో వెను తిరుగుతున్నారు. వీర మహిళలది కూడా అదే పరిస్థితి. అయితే తమ బాధను విని తరువాత మాట్లాడాలన్న వారి ప్రయత్నాలకు ఆదిలోనే గండి కొడుతున్నారు. దీంతో తమ బాధను వారు పూర్తిగా చెప్పలేకపోతున్నారు.