2025 Malaysia Tri-Series: గత్తర లేపిన సూపర్ ఓవర్‌ డ్రామా! 0 పరుగులతో హాంకాంగ్‌పై బహ్రెయిన్ సెన్సేషనల్ రికార్డు!

Written by RAJU

Published on:


2025 మలేషియా ముక్కోణపు T20I సిరీస్‌లో బహ్రెయిన్ జట్టు అపూర్వమైన రికార్డును సృష్టించింది. హాంకాంగ్‌తో జరిగిన ఐదో మ్యాచ్‌లో సూపర్ ఓవర్ వరకు సాగిన పోరులో బహ్రెయిన్ ఒక్క పరుగు కూడా చేయలేకపోయింది! ఇది అంతర్జాతీయ T20 క్రికెట్‌లో చాలా అరుదుగా కనిపించే సంఘటన. బహ్రెయిన్ కెప్టెన్ అహ్మర్ బిన్ నాసిర్, బ్యాట్స్‌మన్ సోహైల్ అహ్మద్ ఇద్దరూ హాంకాంగ్ ఆఫ్-స్పిన్నర్ ఎహ్సాన్ ఖాన్ బౌలింగ్‌లో డకౌట్‌గా వెనుదిరిగారు. హాంకాంగ్ జట్టు బ్యాటర్ బాబర్ హయత్ ఇంకా మూడు బంతులు మిగిలి ఉండగానే అవసరమైన పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు.

ఈ విజయంతో హాంకాంగ్ ట్రై-సిరీస్‌లో రెండో గెలుపు సాధించింది. మరుసటి రోజు మలేషియాపై మరో భారీ విజయం నమోదు చేసి, పాయింట్ల పట్టికలో రెండవ స్థానాన్ని దక్కించుకుంది. మరోవైపు, బహ్రెయిన్ ఇప్పటికీ నాలుగు మ్యాచ్‌లలో మూడు విజయాలతో ఆరు పాయింట్లు సాధించి పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

మార్చి 14న కౌలాలంపూర్‌లోని బయుమాస్ ఓవల్ వేదికగా జరిగిన మలేషియా ముక్కోణపు T20I సిరీస్ ఐదో మ్యాచ్‌లో బహ్రెయిన్ – హాంకాంగ్ జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. మొదట బహ్రెయిన్ బౌలర్లు హాంకాంగ్‌ను కేవలం 129/7 పరుగులకే పరిమితం చేశారు. బౌలింగ్ విభాగంలో రిజ్వాన్ బట్ రెండు వికెట్లు పడగొట్టగా, అలీ దావూద్, ఇమ్రాన్ అన్వర్, అబ్దుల్ మజీద్ తలా ఒక వికెట్ తీశారు.

హాంకాంగ్ బ్యాటింగ్‌లో షాహిద్ వాసిఫ్ 31 పరుగులు చేసి జట్టును నిలబెట్టేందుకు ప్రయత్నించాడు. కానీ, అవతలి ఎండ్‌లో వరుసగా వికెట్లు కోల్పోవడం వల్ల స్కోరు ఎక్కువగా పెరగలేదు.

బహ్రెయిన్ బౌలర్ల అద్భుత ప్రదర్శన తర్వాత, వారి బ్యాటింగ్ ఆశించిన స్థాయిలో రాణించలేదు. 129 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బహ్రెయిన్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 129 పరుగులకే పరిమితమైంది, ఫలితంగా మ్యాచ్ టై అయింది. ప్రశాంత్ కురుప్ 37 బంతుల్లో 31 పరుగులు చేయగా, కెప్టెన్ అహ్మర్ బిన్ నాసిర్ కేవలం 24 బంతుల్లో 36 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. అయితే, యాసిమ్ ముర్తజా మూడు వికెట్లు తీసి బహ్రెయిన్ బ్యాటింగ్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేశాడు.

మ్యాచ్ టై అయిన నేపథ్యంలో, విజేతను నిర్ణయించడానికి సూపర్ ఓవర్ ఆడించారు. కానీ, ఇది బహ్రెయిన్‌కు దారుణమైన అనుభవంగా మారింది. ఎహ్సాన్ ఖాన్ బౌలింగ్‌లో బహ్రెయిన్ కెప్టెన్ అహ్మర్ బిన్ నాసిర్, సోహైల్ అహ్మద్ – ఇద్దరూ డకౌట్ అయ్యారు! ఫలితంగా, బహ్రెయిన్ సూపర్ ఓవర్‌లో 0 పరుగులకే ఆలౌట్ అయింది, ఇది క్రికెట్ చరిత్రలో అరుదైన సంఘటన.

అంతలోనే హాంకాంగ్ బ్యాటింగ్‌కు దిగింది. బాబర్ హయత్ ఒక్కరే చాలు అన్నట్లుగా బ్యాటింగ్ చేసి, ఇంకా మూడు బంతులు మిగిలి ఉండగానే విజయం అందించాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Subscribe for notification