Site icon Desha Disha

మార్కెట్‌లో జర జాగ్రత్త

న్యూఢిల్లీ: స్టాక్‌ మార్కెట్‌ ర్యాలీపై హెచ్చరికలు వినిపిస్తున్నాయి. నిఫ్టీ 20 శాతం అధిక విలువతో ట్రేడవుతున్నందున జాగ్రత్తగా ఉండాలని కోటక్‌ ఇనిస్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ త్రైమాసిక నివేదికలో హెచ్చరించింది. వచ్చే ఆరు నుంచి తొమ్మిది నెలల్లో ఎపుడైనా మార్కెట్‌లో దిద్దుబాటు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. ఈ సంవత్స రం స్టాక్‌మార్కెట్‌లో పెద్దగా లాభాలు వచ్చే అవకాశం కూడా కనిపించడంలేదంది. ఒకవేళ కొన్ని షేర్లలో కొద్దిపాటి లాభాలున్నా, ఎక్కువ కంపెనీల షేర్లలో మాత్రం నష్టాలు తప్పవని హెచ్చరించింది. ఈ ఏడాది మార్కెట్‌ లాభాలు ఫండమెంటల్స్‌, సెంటిమెంట్‌ మధ్య జరిగే పోరాటంపై ఆధారపడి ఉంటాయని తెలిపింది.

Exit mobile version