Site icon Desha Disha

Salaar First Day Boxoffice Collection Massacre l సలార్ ఫస్ట్ డే కలెక్షన్ ఊచకోత 2023

Salaar First Day Boxoffice Collection Massacre:-పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ (Salaar: Part 1 – Ceasefire) పై ప్రారంభం నాటి నుండి అందరిలో ఎన్నో భారీ అంచనాలు నెలకొని ఉన్న విషయం తెలిసిందే. ఈ మూవీలో పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు, శ్రియా రెడ్డి, టిన్ను ఆనంద్,, ఈశ్వరరావు, బాబీ సింహా వంటి వారు మెయిన్ రోల్స్ లో నటించగా హీరోయిన్ గా అందాల నటి శృతి హాసన్ కనిపించారు.

ఇక ఈ మూవీని KGF సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించగా ప్రముఖ నిర్మాత విజయ్ కిరగందూర్ దీనిని హోంబలె ఫిలిమ్స్ బ్యానర్ పై గ్రాండ్ లెవెల్లో నిర్మించారు. కాగా ఈ పాన్ ఇండియా మూవీ నిన్న అత్యధిక థియేటర్స్ లో ప్రపంచవ్యాప్తంగా పలు భాషల ఆడియన్స్ ముందుకి వచ్చి ఫస్ట్ డే ఫస్ట్ షో నుండే సూపర్ డూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది.

Salaar First Day Boxoffice Collection Massacre

ముఖ్యంగా 2017లో ప్రభాస్ హీరోగా రాజమౌళి తెరకెక్కించిన భారీ మూవీ బాహుబలి 2 (Baahubali 2: The Conclusion) తరువాత ప్రభాస్ నుండి సరైన సక్సెస్ఫుల్ సినిమా రాలేదు. దానితో ఒకింత నిరాశ చెందిన ఆయన ఫ్యాన్స్, ఫైనల్ గా సలార్ చూసి ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక సలార్ లో ప్రభాస్ పవర్ఫుల్ రోల్ లో అదరగొట్టారు.

భారీ లెవెల్లో చిత్రీకరించిన విజువల్స్, మాస్ యాక్షన్ సన్నివేశాలు, హృద్యమైన ఎమోషన్స్, సాంగ్స్, గూస్ బంప్స్ తెప్పించే ఫైట్స్ వంటివి ఈ మూవీ సక్సెస్ కి ప్రధాన కారణాలు. ఇక సలార్ మూవీ ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా రూ. 178. 71 కోట్ల గ్రాస్ కలెక్షన్ ని సొంతం చేసుకుని ఈ ఏడాది ఇండియా వైడ్ గా అత్యధిక గ్రాస్ కొల్లగొట్టిన మూవీగా సెన్సేషనల్ రికార్డు ని నమోదు చేసింది.

Salaar First Day Boxoffice Collection Massacre

ఇక మరోవైపు హిందీ మార్కెట్ లో కూడా సత్తా చాటుతోంది సలార్ మూవీ. కాగా హిందీ బెల్ట్ లో ఈ మూవీ డే 1 రూ. 15 కోట్లు రాబట్టింది. మొత్తంగా మొదటి రోజు నుండి సలార్ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ ఊచకోతను మొదలెట్టింది అని చెప్పాలి. మరి రాబోయే రోజుల్లో ఈ మూవీ ఎంతమేర కొల్లగొడుతుందో చూడాలని అందరూ ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.

మరిన్ని మూవీ న్యూస్ కోసం క్లిక్ చేయండి

Salaar First Day Boxoffice Collection Massacre

Exit mobile version