
నవతెలంగాణ – భువనగిరి
భారతదేశ తొలి సామాజిక ఉద్యమకారుడు, జ్యోతిరావు పూలే 199వ జయంతి నీ యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా, బీసీలంతా ప్రతి ఒక్కరు గ్రామ గ్రామాన ఘనంగా జరుపుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కొత్త నరసింహస్వామి పిలుపునిచ్చారు. గురువారం స్థానిక బిసి కార్యాలయంలో విలేకరుల తో మాట్లాడారు. పూలే ఆశయాలను, సమాజానికి చేసిన వారి సేవలను, బీసీలంతా గుర్తుకు తెచ్చుకోవాలని.. వారిని ఆదర్శంగా తీసుకుని బహుజన నాయకులంతా భవిష్యత్తులో ముందుకు నడవాలన్నారు. రేపు బోనగిరి జిల్లా కేంద్రంలో, జగదేకపూర్ చౌరస్తా లో పూలే విగ్రహం వద్ద జరగబోయే ఫూలే 199వ జయంతి అధికారిక కార్యక్రమంలో బీసీలు అంతా అత్యధికంగా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగిర్, సాబన్కార్ వెంకటేష్, అశోక చారి, గాజుల క్రాంతి కుమార్, గుండెబోయిన సురేష్ యాదవ్, శ్యామ్, రాజు, శేఖర్, శరత్, శివ, తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు.