- గత 11 ఏళ్లలో మోడీ చెప్పిన 11 పెద్ద అబద్దాలను లిస్టవుట్ చేసిన ఖర్గే..
- బ్లాక్ మనీ అంతా తెచ్చి ఒక్కొక్కరి అకౌంట్లో రూ. 15 లక్షలు..
- ఏటా 2 కోట్ల మందికి జాబ్స్ అన్నాడు..
- పెట్రోలో డీజిల్ ధరలు బాగా తగ్గిస్తానన్నాడు: మల్లికార్జున ఖర్గే

Mallikarjun Kharge: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దేశానికే అబద్దాలు చెబుతున్నారని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. 11 ఏళ్లలో ఆయన చెప్పిన అతి పెద్ద 11 అబద్ధాలు ఇవేనంటూ ఓ లిస్టును విడుదల చేశారు. ఇక, శనివారం కర్ణాటకలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఖర్గే.. ఈ సందర్భంగా మాట్లాడారు. మోడీ ఇచ్చిన హామీలపై విమర్శలు గుప్పించారు.
Read Also: IND vs NZ: నేడు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్.. పిచ్ రిపోర్ట్ ఇదే
మొదటి అబద్ధం: విదేశాల నుంచి బ్లాక్ మనీ తీసుకొచ్చి ప్రజల బ్యాంకు ఖాతాల్లో రూ.15 లక్షల చొప్పున జమ చేస్తామని చెప్పడం.
రెండో అబద్ధం: ప్రతి ఏడాది 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం..
మూడో అబద్ధం: పెట్రోలో డీజిల్ ధరలు బాగా తగ్గిస్తానన్నాడు..
నాలుగో అబద్ధం: 2022 నాటికే గంగానది మొత్తం ప్రక్షాళన అన్నాడు..
ఐదో అబద్ధం: మేక్ ఇన్ ఇండియా కింద కోట్లాది మాన్యుఫాక్చరింగ్ జాబ్స్ అన్నాడు..
ఆరో అబద్ధం: ఇండియన్స్ అందరికీ 2022 నాటికే పక్కా ఇళ్లు కట్టిస్తానన్నాడు..
ఏడో అబద్ధం: రైతుల ఆదాయం డబుల్ చేస్తానన్నాడు.. మోడీ ఇంత మోసం చేస్తున్నప్పటికీ.. యువత అతడికి ఎందుకు మద్దతు ఇస్తున్నారో..? నాకు ఇంకా తెలియడం లేదని పేర్కొన్నారు. కులం, మతం ఆధారంగా ఇస్తున్నారా..? నాకైతే అర్థం కావడం లేదు అని వ్యాఖ్యనించారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన కాంగ్రెస్ పార్టీ నేతలకు ప్రజలు ఎందుకు సపోర్టు ఇవ్వడం లేదని ఏఐసీసీ అధినేత మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు.