ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రి వైద్య శాస్త్ర రంగంలోనే ఒక గొప్ప విజయాన్ని సాధించింది. ఎయిమ్స్ పీడియాట్రిక్ సర్జరీ వైద్య బృందం 11 ఏళ్ల బాలికకు అరుదైన కీహోల్ సర్జరీని విజయవంతంగా నిర్వహించింది. ఈ సర్జరీ ప్రపంచంలోనే పూర్తిగా లాపరోస్కోపిక్‌గా చేయబడిన మొట్టమొదటి శస్త్రచికిత్స. ఎనిమిదిన్నర గంటల పాటు జరిగిన ఈ శస్త్రచికిత్సలో వైద్యులు క్లోమ గ్రంథి కణితిని తొలగించి, దానిలో ఒక భాగాన్ని పునర్నిర్మించారు. ఈ ఆపరేషన్‌తో అమ్మాయి క్యాన్సర్ నుండి బయటపడగలిగింది. దీనిని ప్రొఫెసర్ డాక్టర్ అంజన్ కుమార్ దువా నాయకత్వంలో నిర్వహించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
జార్ఖండ్‌లోని గర్హ్వా జిల్లాకు 11ఏళ్ల బాలిక చాలా కాలంగా కడుపు నొప్పితో బాధపడుతోంది. బాలికను పరీక్షించిన వైద్యులు ఆమె క్లోమంలో ఏర్పడే సాలిడ్ సూడోపాపిల్లరీ ఎపిథీలియల్ నియోప్లాజమ్ (SPEN) అనే అరుదైన కణితి ఉందని గుర్తించారు. కణితిని తొలగించడానికి సంక్లిష్టమైన విప్పిల్ శస్త్రచికిత్స అవసరమని చెప్పారు. ఇందులో క్లోమం, జీర్ణవ్యవస్థ భాగాలను తొలగించి పునర్నిర్మించడం జరుగుతుంది.
సాధారణంగా ఇలాంటి సర్జరీలో పొత్తికడుపులో పెద్ద కోత పెట్టాల్సి వస్తుంది. దీని వలన నొప్పి, గాయం గుర్తు ఉండిపోతుంది. కానీ AIIMS బృందం ఈ ఆపరేషన్‌ను కేవలం 4 చిన్న రంధ్రాల ద్వారా నిర్వహించింది. 8.5 గంటల పాటు జరిగిన ఈ శస్త్రచికిత్సలో కేవలం 80 మి.లీ.ల రక్తం మాత్రమే నష్టపోయింది. బాధితుఆరలు తక్కువ నొప్పితో రోజుల తరబడి ఆస్పత్రిలో ఉండాల్సిన అవసరం లేకుండా తనకు వచ్చిన వ్యాధి నుండి సురక్షితంగా బయటపడగలిగిందని వైద్యులు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..