ఈ బ్రాండ్ ప్రస్తుతం భారతదేశంలో ‘ఐఫోన్ 16’ సిరీస్‌లోని అన్ని మోడళ్లను అసెంబుల్ చేస్తోంది. ఇక ఫాక్స్‌కాన్, పెగాట్రాన్, టాటా ఎలక్ట్రానిక్స్ యాపిల్‌కు భారతదేశంలో కీలకమైన సప్లయర్స్. ఏప్రిల్ నుంచే హైదరాబాద్‌లో వీటి ప్రొడక్షన్ ప్రారంభం కానున్నాయని, అయితే ఇవి ఎక్స్‌పోర్ట్స్‌కు మాత్రమేనని PTI నివేదిక తెలిపింది. ఇది గనక జరిగితే ఐఫోన్ మోడళ్ల తర్వాత భారతదేశంలో అసెంబుల్ అవుతున్న యాపిల్ సెకండ్ మేజర్ ప్రొడక్ట్ ఎయిర్‌పాడ్స్ కానున్నాయి. యాపిల్ ప్రస్తుతం భారత్‌లో ఎంపిక చేసిన ఐఫోన్ మోడళ్లను తయారు చేస్తోంది. ఇప్పుడు ఇక్కడ యాపిల్ వైర్‌లెస్ ఇయర్‌ఫోన్‌ల ప్రొడక్షన్ కంపెనీ విస్తరణ వ్యూహంలో ఓ భాగం. చైనా నుంచి దూరంగా ప్రొడక్షన్‌ను డైవర్సిఫై చేయాలని చూస్తోంది. ఇకపోతే 2023లో హైదరాబాద్ ప్లాంట్‌లో ఎయిర్‌పాడ్‌ల ఉత్పత్తి కోసం ఫాక్స్‌కాన్ $400 మిలియన్లు అంటే రూ. 3,325 కోట్లు పెట్టుబడులు పెట్టింది. అమెరికా నుంచి భారత్‌కు దిగుమతి అవుతున్న ఎయిర్‌పాడ్స్‌పై ఇక్కడ 20శాతం కస్టమ్స్ డ్యూటీ చెల్లించాల్సి వస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఓటు కార్డు-ఆధార్ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్ మండిపాటు
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?