వినయ్ కుమార్, శ్రావణి మజ్జరి, అరవింద్ ముదిగొండ, నోమిన తార ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘కాలమేగా కరిగింది’. ఈ సినిమాను శింగర క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై మరే శివశంకర్ నిర్మించారు. శింగర మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. పొయెటిక్ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మేకర్స్ ఫ˜ునంగా నిర్వహించారు. ప్రొడ్యూసర్ మరే శివశంకర్ మాట్లాడుతూ, ‘ఈ సినిమాకు సపోర్ట్ చేసిన డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్‌కి, ఆనంద్ దేవరకొండకు థ్యాంక్స్. ఆదిత్య మ్యూజిక్ మా పాటలు బాగా రీచ్ అయ్యేలా సపోర్ట్ చేసింది. అచ్చ తెలుగులో చేసిన స్వచ్ఛమైన ప్రేమ కథ ఇది. మీరంతా మా మూవీని ఈ నెల 21న థియేటర్స్‌లో చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నాం’ అని అన్నారు.
‘మోస్ట్ పొయెటిక్ లవ్ స్టోరీ మా సినిమా అని చెప్పేందుకు గర్వంగా ఉంది. మా మూవీ ట్రైలర్ లాంచ్ చేేసిన డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్‌కి థ్యాంక్స్. ఆయన ప్రశంసలు మా సినిమాకు దక్కడం సంతోషంగా ఉంది. మా సినిమా పొయెటిక్‌గా ఉంటుంది. ఈ కథను తన మ్యూజిక్‌తో మరింత బ్యూటీఫుల్‌గా తయారు చేశారు మ్యూజిక్ డైరెక్టర్ గుడప్పన్. ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ బాగున్నాయి అంటే అందుకు గుడప్పన్ మ్యూజిక్ వన్ ఆఫ్ ది రీజన్. డీవోపీ వినీత్ మా సినిమాకు కళ్లలా పనిచేశాడు. తన కెమెరాతో సినిమాను అందంగా చూపించాడు. ఎడిటర్ యోగేష్ ఎన్ని వెర్షన్స్ అయినా చేసి ఇచ్చాడు’ అని డైరెక్టర్ శింగర మోహన్ తెలిపారు.

స్వచ్ఛమైన ప్రేమకథా చిత్రం –
Written by RAJU
Published on: