దర్శకుడు మల్లిడి వశిష్ట సోదరుడు మల్లిడి కష్ణ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. కుశాల్ రాజును హీరోగా పరిచయం చేస్తూ ఎంఎస్‌ఆర్ క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.1గా స్కైఫై డ్రామాను తెరకెక్కిస్తున్నారు. డా. లతా రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం సోమవారం అన్నపూర్ణ స్టూడియోలో పూజా కార్యక్రమాలతో వైభవంగా ప్రారంభమైంది. ఎస్వీ కష్ణారెడ్డి, అచ్చిరెడ్డి స్క్రిప్ట్‌ను అందజేయగా, వీవీ వినాయక్ ఫస్ట్ షాట్‌కు క్లాప్ కొట్టారు. మల్లిడి వశిష్ట ఫస్ట్ షాట్‌కి డైరెక్షన్ చేశారు.
ఈ సందర్భంగా దర్శకుడు మల్లిడి కష్ణ మాట్లాడుతూ,’నిర్మాత లతకి థ్యాంక్స్ చెప్పాలి. అలాంటి మంచి నిర్మాత దొరకాలంటే అదష్టం ఉండాలి. ఇదొక స్కైఫై డ్రామా మూవీ. ఇలాంటి కథను ఎంచుకోవాలంటే ధైర్యం ఉండాలి’ అని అన్నారు. ‘ఈ సినిమా కోసమే నా హెయిర్ స్టైల్ మార్చాను. ఇందులో నాది పాజిటివ్ క్యారెక్టర్. డైరెక్టర్ కథ చెప్పినప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యాను’ అని సీనియర్ నటుడు పథ్వీరాజ్ చెప్పారు. హీరో కుశాల్ రాజు మాట్లాడుతూ,”దర్శకుడు కష్ణకు థ్యాంక్స్. నన్ను హీరోగా పరిచయం చేయడం కోసం మా అమ్మ లత చాలా కేర్ తీసుకున్నారు’ అని తెలిపారు. నిర్మాత డా||లతారాజు మాట్లాడుతూ, ‘నిర్మాతగా నాకు ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ లేదు. మా అబ్బాయి కోరిక మేరకు నిర్మాత అయ్యాను. డైరెక్టర్ స్టోరీ చెప్పినప్పుడు చాలా కొత్తగా అనిపించింది. పథ్వీ క్యారెక్టర్ చాలా అద్భుతంగా ఉంటుంది. కామెడీ, లవ్ అన్నీ సమపాళ్లలో ఉంటాయి’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం :శ్రీచరణ్ పాకాల, సినిమాటోగ్రాఫర్: అమర్నాథ్ బొమ్మిరెడ్డి, ఫైట్ మాస్టర్: జీవన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బాబీ రెడ్డి.

స్కై ఫై డ్రామా నేపథ్యంలో.. –

Written by RAJU
Published on: