2025లో ఊహించని పరిణామాలు, విధ్వంసాలు, ఏలియన్స్‌తో సంబంధాల వంటి అంశాలపై బాబా వంగా, నోస్ట్రాడమస్ లాంటి ప్రసిద్ధి చెందిన జ్యోతిష్య నిపుణులు అంచనా వేశారు. ఈ ఏడాది ఆరంభంలోనే వారు గతంలో వారి రచనల్లో, ప్రసంగాల్లో 2025 ఏడాది గురించి చెప్పిన అంశాలు వైరల్ అయ్యాయి. వాటిలో కొన్ని ప్రస్తుతం జరుగుతున్న వాటికి పోలి ఉండటంతో చాలా మంది వాళ్లు చెప్పింది జరుగుతుందని నమ్ముతున్నారు. అయితే తాజాగా బాబా వంగా, నోస్ట్రాడమస్‌తో పాటు మరో వ్యక్తి కూడా 2025లో సంభవించబోయే విధ్వంసాల గురించి చెప్పుకొచ్చారు. ఆయన చెప్పిన విషయాలు ప్రస్తుతం సంచలనం సృష్టిస్తున్నాయి. ఎల్విస్ థాంప్సన్ అనే వ్యక్తి తనకు తాను ఓ టైమ్ ట్రావెలర్‌గా చెప్పుకుంటూ ఉంటారు. ఆయన 2025కి సంబంధించిన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఇంతకీ ఆయన 2025 గురించి ఏం చెప్పారో ఇప్పుడు తెలుసుకుందాం.. అతని అంచనాలలో ఒక్లహోమాలో వినాశకరమైన సుడిగాలి, అమెరికన్ అంతర్యుద్ధం, ఒక భారీ సముద్ర జీవి ఆవిష్కరణ, ఛాంపియన్ అనే గ్రహాంతరవాసి రాక, అమెరికాలో భారీ తుఫాను వంటి సంచలన విషయాలు ఉన్నాయి. ఏప్రిల్ 6న 24 కిలోమీటర్ల వెడల్పు విస్తరించి, గంటకు 1,046 కి.మీ వేగంతో వీచే సుడిగాలి అమెరికాలోని ఒక్లహోమాను అతలాకుతలం చేస్తుందని పేర్కొన్నారు. అలాగే మే 27న రెండవ అమెరికన్ అంతర్యుద్ధం ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 1న ఛాంపియన్ అనే గ్రహాంతర వాసి భూమిపైకి వచ్చి 12,000 మంది మానవులను భద్రత కోసం మరొక గ్రహానికి తీసుకెళ్తుంది.
సెప్టెంబర్ 19న అమెరికా తూర్పు తీరాన్ని శక్తివంతమైన తుఫాను తాకుతుంది. నవంబర్ 3న నీలి తిమింగలం కంటే ఆరు రెట్లు పెద్దదిగా ఉండే సముద్ర జీవిని కనిపెడతారు. ఇలా తేదీలతో సహా ఎల్విస్ 2025 జరగబోయే విషయాల గురించి చెప్పారు. తాను భవిష్యత్తులోకి టైమ్ ట్రావెల్ చేసి.. ఈ విషయాల గురించి చెబుతున్నట్లు ఎల్విస్ ఒక వీడియోలో వెల్లడించారు. ఇక మరోవైపు ప్రసిద్ధ జోతిష్య నిపుణులు బాబా వంగా, నోస్ట్రాడమస్‌లు 2025కి సంబంధించి తమ అంచనాలను గతంలోనే వెల్లడించారు. ఏలియన్స్ గురించి బాబా వంగా కూడా ప్రస్తవించారు. ఈ ఏడాదిలోనే ఏలియన్స్‌తో మానవులకు పరిచయం ఏర్పడుతుందని ఆమె వెల్లడించారు. అలాగే రాబోయే కాలంలో ఒక వినాశకరమైన యుద్ధం జరుగుతుందని అంచాన వేశారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.