సెన్సెక్స్‌ 593 పాయింట్లు అప్‌ | Sensex Positive aspects 593 Factors Amid Market Restoration

Written by RAJU

Published on:

ముంబై: అమెరికా అధ్యక్షడు డొనాల్డ్‌ ట్రంప్‌ పరస్పర సుంకాలను ప్రకటించనున్న నేపథ్యంలో క్రితం సెషన్‌లో భారీగా నష్టపోయిన ఈక్విటీ సూచీలు బుధవారం కాస్త కోలుకున్నాయి. బ్యాంకింగ్‌, వాహన, ఐటీ రంగ షేర్లలో ఇన్వెస్టర్లు వేల్యూ బైయింగ్‌కు పాల్పడటంతో సెన్సెక్స్‌ 592.93 పాయింట్లు ఎగబాకి 76,617.44 వద్దకు చేరింది. నిఫ్టీ 166.65 పాయింట్ల లాభంతో 23,332.35 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లోని 30 నమోదిత కంపెనీల్లో 18 రాణించాయి. బీఎ్‌సఈ మిడ్‌క్యాప్‌ సూచీ 1.38 శాతం, స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌ 0.99 శాతం పెరిగాయి.

ఎన్‌ఎ్‌సడీఎల్‌ ఐపీఓకు గడువు జూలై 31

నేషనల్‌ సెక్యూరిటీస్‌ డిపాజిరీ లిమిటెడ్‌(ఎన్‌ఎ్‌సడీఎల్‌) ఐపీఓను ప్రారంభించేందుకు గడువును సెబీ ఈ జూలై 31 వరకు పొడిగించింది. ఎన్‌ఎ్‌సడీఎల్‌ రూ.3,000 కోట్ల ఐపీఓకు మార్కెట్‌ నియంత్రణ మండలి 2024 సెప్టెంబరులోనే ఆమోదం తెలిపింది. డిపాజిటరీ ఐపీఓకు వచ్చేందుకు ఇదివరకున్న గడువు ఈనెల 11తో ముగియనుంది.

ఇవి కూడా చదవండి:

Loan Charges: ఏప్రిల్‌లో పర్సనల్ లోన్స్‌పై ప్రధాన బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు

Business Idea: మహిళలకు బెస్ట్..లక్ష పెట్టుబడితో వ్యాపారం, నెలకు రూ.3 లక్షల ఆదాయం..

Read More Business News and Latest Telugu News

Updated Date – Apr 03 , 2025 | 03:03 AM

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights