నవతెలంగాణ-చిన్నకోడూరు
తమకు నష్ట పరిహారం చెల్లించాకే రైల్వేలైన్ పనులు చేపట్టాలని సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల పరిధిలోని గంగాపూర్ రైతులు శుక్రవారం పనులను అడ్డుకున్నారు. తమ పట్టా భూములు రైల్వేలైన్ నిర్మాణ పనుల్లో కోల్పోయామని, ఇప్పటి వరకు తమకు నష్ట పరిహారం చెల్లించలేదన్నారు. పరిహారం కోసం అధికారుల చుట్టూ తిరిగి తిరిగి విసిగి వేసారిపోతున్నామని తెలిపారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. తమ భూములకు నష్టపరిహారం చెల్లించాకే పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ బాలకృష్ణ సంఘటనా స్థలానికి చేరుకొని రైతులతో మాట్లాడారు. రైతుల సమస్యను జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

సిద్దిపేట జిల్లా గంగాపూర్‌లో రైల్వేలైన్ పనులు అడ్డుకున్న రైతులు

Written by RAJU
Published on: