సిట్రోయెన్​ కార్లపై 1.75లక్షల వరకు బెనిఫిట్స్​- త్వరపడండి..-untitled citroen basalt c3 aircross and ec3 gets benefits of up to 1 75 lakh ,బిజినెస్ న్యూస్

Written by RAJU

Published on:

సిట్రోయెన్ సీ3..

ఇండియన్ మార్కెట్​లో సిట్రోయెన్​కి ఉన్న బెస్ట్​ సెల్లింగ్​ ప్రాడక్ట్స్​లో ఒకటి ఈ సీ3. ఈ బ్రాండ్ లాంచ్ చేసిన మొదటి కారు ఇదే. లైవ్, ఫీల్, షైన్ అనే మూడు వేరియంట్లలో ఈ హ్యాచ్​బ్యాక్ లభిస్తుంది. టాప్ ఎండ్ షైన్ వేరియంట్​లో కూడా వైబ్ ప్యాక్ లభిస్తుంది. సీ3 ధర రూ.6.16 లక్షల నుంచి రూ.10.15 లక్షల మధ్యలో ఉంది. రెండు ధరలు ఎక్స్-షోరూమ్. ఇది నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ లేదా టర్బోఛార్జ్​డ్​ పెట్రోల్ ఇంజిన్​ని కలిగి ఉంటుంది. నేచురల్ ఆస్పిరేటెడ్ ఇంజిన్ 81బీహెచ్​పీ పవర్, 115ఎన్ఎమ్ టార్క్​ని ప్రొడ్యూస్ చేస్తుంది. టర్బోచార్జ్​డ్ ఇంజిన్ 108బీహెచ్​పీ పవర్, 205ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. బేస్ ఇంజిన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్​మిన్​ని పొందుతుంది. టర్బో ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్​బాక్స్​, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ యూనిట్​ని పొందుతుంది. ప్రస్తుతం సీ3 కారుపై రూ.లక్ష బెనిఫిట్స్ లభిస్తున్నాయి.

Subscribe for notification