నరసన్నపేట, మార్చి 23(ఆంధ్రజ్యోతి): పోరాటాల పురిటిగడ్డ సిక్కోలు అని.. ఇక్కడి నుంచి పేదల పక్షాన విప్లవ బాటపట్టి దిక్సూ చిగా నిలిచిన వ్యక్తి మామిడి అప్పలసూరి అని పీపుల్స్‌స్టార్, సినీ నటుడు ఆర్.నారా యణ మూర్తి అన్నారు. ప్రముఖ రచయిత అట్టాడ అప్పలనాయుడు రచించిన ‘మండేటి సూరీడు’ మామిడి అప్పలసూరి జీవితచరిత్ర పుస్తకాన్ని ఆదివారం కోమర్తిలో అమరవీరుల స్మారక స్థూపం వద్ద నారాయణ మూర్తి ఆవి ష్కరించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాడిత, పీడిత, గిరిజనుల పక్షాన నిలిచి సిక్కో లు గడ్డ నుంచి పోరాటాలు చేసిన ఆదిభట్ల కైలాసం, వెంపటాపు సత్యం, కోరన్న, మంగన్న వంటి వారు పెద్ద గురువుగా అప్పలసూరిని పిలుచుకునేవారన్నారు. ఆయన చరిత్రను పుస్త క రూపంలో తీసుకురా వడం అభినంద నీయ మన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్, సీపీఐఎంల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాశ్, సీపీఐఎంఎల్ రాష్ట్ర కమిటీ సభ్యులు దంతలూరి వర్మ, తామాడ సన్యాసిరావు, ప్రజా కళామండలి రాష్ట్ర నాయకుడు కొర్రాయి నీలకంఠం, సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు భవిరి కృష్ణమూర్తి, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి, గంటేడ గౌరునాయుడు, వాన కృష్ణచంద్, మామిడి క్రాంతి, రవి తదితరులు పాల్గొన్నారు.