సికింద్రాబాద్‌ రైల్వేలో 1642 ఉద్యోగాలు.. 10th, ITI చదివితే చాలు

Written by RAJU

Published on:

RRB Secunderabad Group D South Central Railway : రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ (RRB) గ్రూప్‌ డీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. వివరాల్లోకెళ్తే..

హైలైట్:

  • ఆర్‌ఆర్‌బీ గ్రూప్‌ డీ రిక్రూట్‌మెంట్‌ 2025
  • మొత్తం 32,438 ఖాళీల భర్తీకి ప్రకటన
  • సికింద్రాబాద్‌ పరిధిలో 1642 ఖాళీలు
  • ఫిబ్రవరి 22 దరఖాస్తులకు చివరితేది

Samayam Teluguసికింద్రాబాద్‌ రైల్వే గ్రూప్‌ డీ రిక్రూట్‌మెంట్‌ 2025<span class="redactor-invisible-space"></span>
సికింద్రాబాద్‌ రైల్వే గ్రూప్‌ డీ రిక్రూట్‌మెంట్‌ 2025

RRB Group D Recruitment 2025 : రైల్వే శాఖ (Indian Railway)లో ఉద్యోగం కోసం ప్రిపేరవుతున్న అభ్యర్థులకు అద్భుతమైన అవకాశం. రైల్వే శాఖలోని 32,438 లెవెల్‌ -1 గ్రూప్‌ డీ ఉద్యోగాలు భర్తీకి RRB (Railway Recruitment Board) నోటిఫికేషన్‌ విడుదలైంది. దరఖాస్తుల ప్రక్రియ కూడా జనవరి 23 నుంచి ప్రారంభమైంది. టెన్త్‌/ ఐటీఐ విద్యార్హతతో గ్రూప్‌- డీ లెవెల్‌ -1 కేటగిరీలో మొత్తం 32,438 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఇందులో సౌత్‌ సెంట్రల్‌ రైల్వే సికింద్రాబాద్‌ పరిధిలో 1642 ఉద్యోగాలు ఉన్నాయి. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు జనవరి 23 నుంచి ఫిబ్రవరి 22వ తేదీ వరకు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ లింక్ ఇదే.. క్లిక్‌ చేయండి. అలాగే.. పూర్తి నోటిఫికేషన్‌ లింక్‌ ఇదే.ఖాళీలను భర్తీ చేయనున్న ఆర్‌ఆర్‌బీ రీజియన్లు: అహ్మదాబాద్, అజ్‌మేర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్‌పూర్, చండీగఢ్, చెన్నై, గోరఖ్‌పుర్, కోల్‌కతా, మాల్దా, ముంబయి, పట్నా, ప్రయాగ్‌రాజ్, రాంచీ, సికింద్రాబాద్ రీజియనల్లో ఈ గ్రూప్‌ డీ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

మొత్తం గ్రూప్‌ డీ పోస్టుల సంఖ్య: 32,438

  • పాయింట్స్‌మన్‌- 5,058
  • అసిస్టెంట్‌ (ట్రాక్‌ మెషిన్‌)- 799
  • అసిస్టెంట్‌ (బ్రిడ్జ్‌)- 301
  • ట్రాక్ మెయింటెయినర్ గ్రూప్-4 – 13,187
  • అసిస్టెంట్‌ పీ-వే- 247
  • అసిస్టెంట్‌ (సీ అండ్‌ డబ్ల్యూ)- 2587
  • అసిస్టెంట్‌ లోకో షెడ్‌ (డిజిల్‌)- 420
  • అసిస్టెంట్‌ (వర్క్‌షాప్‌)- 3077
  • అసిస్టెంట్‌ (ఎస్‌ అండ్‌ టీ)- 2012
  • అసిస్టెంట్‌ టీఆర్‌డీ- 1381
  • అసిస్టెంట్‌ లోకో షెడ్‌ (ఎలక్ట్రికల్‌)- 950
  • అసిస్టెంట్‌ ఆపరేషన్స్‌- (ఎలక్ట్రికల్‌)- 744
  • అసిస్టెంట్‌ టీఎల్‌ అండ్‌ ఏసీ- 1041
  • అసిస్టెంట్‌ టీఎల్‌ అండ్ ఏసీ (వర్క్‌షాప్‌)- 625

సికింద్రాబాద్‌లోని ఖాళీల జాబితా :

RRB Secunderabad

ఇతర ముఖ్యమైన సమాచారం :

  • అర్హత: 10వ తరగతి లేదా ఐటీఐ డిప్లొమా, నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ వొకేషనల్‌ ట్రైనింగ్‌ (NCVT) జారీ చేసిన నేషనల్‌ అప్రెంటిషిప్‌ సర్టిఫికెట్‌ (NAC), సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు.. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
  • వయోపరిమితి: 01.07.2025 నాటికి 18 నుంచి 36 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ/ ఎస్సీ/ ఓబీసీ/ పీహెచ్‌ అభ్యర్థులకు వయో సడలింపు ఉంటుంది.
  • ప్రారంభ వేతనం: నెలకు రూ.18,000 ఉంటుంది.
  • ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), డాక్యుమెంట్ వెరిఫికేషన్ (DV), మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
  • దరఖాస్తు ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ, ఎస్టీ, ఈఎస్‌ఎం, ఈబీసీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు రూ.250 ఉంటుంది.
  • దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవాలి.

ముఖ్యమైన తేదీలు :

  • ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభ తేది: జనవరి 23, 2025
  • ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 22, 2025
  • దరఖాస్తుల సవరణకు తేదీలు: ఫిబ్రవరి 25 నుంచి మార్చి 6 వరకు.

RRB Group D పరీక్ష విధానం:

ఆర్‌ఆర్‌బీ గ్రూప్‌ డీ 2025 కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (CBT) విధానంలో ఉంటుంది. 90 నిమిషాల పాటు జరిగే ఈ పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. జనరల్‌ సైన్స్‌ నుంచి 25 ప్రశ్నలు, మ్యాథమెటిక్స్‌ నుంచి 25 ప్రశ్నలు, జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌ నుంచి 30 ప్రశ్నలు, జనరల్‌ అవేర్‌నెస్‌ అండ్‌ కరెంట్‌ అఫైర్స్‌ నుంచి 20 ప్రశ్నలు ఉంటాయి. నెగిటివ్‌ మార్కింగ్‌ విధానం ఉంది. తప్పు సమాధానం గుర్తిస్తే 1/3 మార్కుల కోత విధిస్తారు.

కిషోర్‌ రెడ్డి

రచయిత గురించికిషోర్‌ రెడ్డికిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు.
రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు.
కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.
… ఇంకా చదవండి

Subscribe for notification