నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
సింగరేణి కాలరీస్ సంస్థ కొత్తగూడెంలో తొలి మహిళా కళాశాలను ప్రారంభించి ఈ ఏడాదితో 50 ఏండ్లు పూర్తి చేసుకుంటున్నది. ఈ నేపథ్యంలో సింగరేణి ఎడ్యుకేషనల్ సొసైటీ రూపొందించిన గోల్డెన్ జూబ్లీ లోగోను ఆ సంస్థ సీఎమ్‌డీ ఎన్ బలరాం బుధవారం హైదరాబాద్ సింగరేణి భవన్ నుంచి వర్చువల్‌గా ఆవిష్కరించారు. మహిళా విద్యకు అంకితమై, ఐదు దశాబ్దాలుగా సేవలందిస్తున్న ఆ కళాశాల మరింత వృద్ధి చెందాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డైరెక్టర్లు ఎల్వీ సూర్యనారాయణ, కే వెంకటేశ్వర్లు, సీపీపీ ఏ మనోహర్, కొత్తగూడెం నుంచి సింగరేణి విద్యాసంస్థల కార్యదర్శి గుండా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

సింగరేణి మహిళా కళాశాల స్వర్ణోత్సవ లోగో ఆవిష్కరణ

Written by RAJU
Published on: