సరికొత్త ఎలిమెంట్‌తో ‘దిల్‌ రూబా’

Written by RAJU

Published on:

Hero Kiran Abbavaramహీరో కిరణ్‌ అబ్బవరం నటించిన కొత్త సినిమా ‘దిల్‌ రూబా’. శివమ్‌ సెల్యులాయిడ్స్‌, ప్రముఖ మ్యూజిక్‌ లేబుల్‌ సారెగమ తమ నిర్మాణ సంస్థ అయినటువంటి ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మించాయి. రవి, జోజో జోస్‌, రాకేష్‌ రెడ్డి, సారెగమ నిర్మాతలు. విశ్వ కరుణ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం హోలీ పండుగ సందర్భంగా నేడు (శుక్రవారం) గ్రాండ్‌ థియేట్రికల్‌ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా హీరో కిరణ్‌ అబ్బవరం మాట్లాడుతూ, ‘ఈ సినిమా గురించి వీలైనంతగా మిమ్మల్ని కలిసి చెబుతూ వస్తున్నాం. ఈ రోజు ప్రీమియర్స్‌ పడుతున్నాయి. ఈ సినిమా ఫస్ట్‌ 30 మినిట్స్‌ సరదగా వెళ్తూ, ఆ ముప్పై నిమిషాల తర్వాత కథలోకి తీసుకెళ్తుంది. ఈ కథలో ప్రేమ ఒక్కటే కాదు స్నేహం, ఫాదర్‌-సన్‌, ఫాదర్‌-డాటర్‌ రిలేషన్‌.. ఇలా అన్ని ఎమోషన్స్‌ ఉంటాయి. ఎక్స్‌ లవర్‌ మళ్లీ ఆ ప్రేమికుడి జీవితంలోకి వచ్చి, అతని ప్రెజెంట్‌ లవ్‌ను కలిపే ప్రయత్నం చేయడం అనేది ఇందులో కొత్తగా ఉంటుంది. మాజీ ప్రేయసి, ప్రేమికుడు అంటే శత్రువులా చూడాల్సిన పనిలేదు. వారితోనూ స్నేహాన్ని కొనసాగించవచ్చు అనే ఫీల్‌ గుడ్‌ ఎలిమెంట్‌ మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. మీరు మీ ఫ్యామిలీతో వచ్చి హాయిగా ఈ సినిమా చూడొచ్చు. ఎలాంటి ఇబ్బందికర డైలాగ్స్‌, సన్నివేశాలు ఉండవు. ఈ మూవీలో నటించిన తర్వాత నటుడిగా ఇంకాస్త పరిణితి సాధించా అనిపించింది. ఫైట్స్‌ విషయంలో చాలా సంతప్తిగా ఉన్నాను. మా డైరెక్టర్‌కు ఈ సినిమా తర్వాత మంచి పేరొస్తుంది.

Subscribe for notification