2025 స్కోడా కొడియాక్: ఇంటీరియర్..
ఇంటిరీయర్ విషయానికొస్తే సరికొత్త కొడియాక్ సౌకర్యం, సాంకేతికతకు ప్రాధాన్యత ఇస్తుంది. దీని పొడిగించిన పొడవు ఎక్కువ క్యాబిన్ స్పేస్, బూట్ సామర్థ్యాన్ని ఇస్తుంది. 7-సీటర్ కాన్ఫిగరేషన్‌తో కొనసాగే అవకాశం ఉన్న ఈ ఎస్‌యూవీలో ఇప్పుడు అనేక అధునాతన ఫీచర్లు కూడా చేరాయి. ఇందులో 13 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెట్ సిస్టెమ్, 10.25 ఇంచ్ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, హెడ్స్-అప్ డిస్ప్లే వంటివి ఉన్నాయి. న్యూ జనరేషన్‌తో స్కోడా న్యూ స్మార్ట్ డయల్ సెటప్‌ని సంస్థ పరిచయం చేసింది. ఇది ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ కింద ఉంటుంది. అనేక ఫంక్షన్స్‌ని ఇది కంట్రోల్ చేస్తుంది. వైర్లెస్ యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, 14-స్పీకర్ల కాంటోన్ సౌండ్ సిస్టెమ్, యాంబియంట్ లైటింగ్, హీటింగ్- కూలింగ్‌తో కూడిన పవర్డ్ ఫ్రెంట్ సీట్స్, పనోరమిక్ సన్‌రూఫ్, వైర్లెస్ ఛార్జింగ్, మల్టీ యూఎస్బీ టైప్-సి పోర్ట్స్ వంటివి ఇతర ప్రీమియం ఫీచర్లు.