సమాజంలో సామరస్యం, దయ స్ఫూర్తి పెంచండి.. దేశ ప్రజలకు రాష్ట్రపతి, ప్రధాని ఈద్ శుభాకాంక్షలు

Written by RAJU

Published on:

ఈరోజు దేశవ్యాప్తంగా ఈద్ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద మోదీ దేశ ప్రజలకు ఈద్ శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X లో “ఈద్-ఉల్-ఫితర్ శుభాకాంక్షలు” అని ప్రధాని మోదీ ఒక పోస్ట్ రాశారు. ఈ పండుగ మన సమాజంలో ఆశ, సామరస్యం, దయ స్ఫూర్తిని పెంపొందించుగాక అంటూ ప్రధాని మోదీ పేర్కొన్నారు.

“మీ అన్ని ప్రయత్నాలలో ఆనందం, విజయం పొందాలి, ఈద్ ముబారక్!’’ అంటూ ప్రధాని పేర్కొన్నారు. పవిత్ర రంజాన్ మాసం తర్వాత ఈద్-ఉల్-ఫితర్ జరుపుకుంటారు. ఇది ముస్లింలకు ప్రత్యేకమైన రోజు. ఆదివారం దేశంలో ఈద్ చంద్రుడు కనిపించాడు. ఆ తర్వాత సోమవారం ఈద్ పండుగను ఎంతో వైభవంగా జరుపుకుంటున్నారు.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోషల్ మీడియా ‘X’ వేదికగా రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.’ఈద్-ఉల్-ఫితర్ శుభ సందర్భంగా దేశ ప్రజలందరికీ, ముఖ్యంగా ముస్లిం సోదరులు, సోదరీమణులకు శుభాకాంక్షలు.’ ఈ పండుగ సోదర భావాన్ని బలోపేతం చేస్తుంది. కరుణ, దాతృత్వ స్ఫూర్తిని స్వీకరించే సందేశాన్ని ఇస్తుంది. ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో శాంతి, శ్రేయస్సు, ఆనందాన్ని తీసుకురావాలని, ప్రతి ఒక్కరి హృదయంలో మంచితనం మార్గంలో ముందుకు సాగాలనే స్ఫూర్తిని బలోపేతం చేయాలని కోరుకుంటున్నాను.’’ అంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు.

రంజాన్ పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ముస్లిం సోదర, సోదరీమణులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రేమ, కరుణ, ఐకమత్యం సందేశాలతో సేవాతత్పరత, ఆధ్యాత్మికత వెల్లివిరిసే ఈద్ ఉల్ ఫితర్ పర్వదినం సందర్భంగా అల్లా కరుణా కటాక్షాలు అందరిపైన ఉండాలని ఆకాంక్షించారు.

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సోమవారం రాష్ట్ర ప్రజలకు ఈద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ సందర్భంగా, ప్రతి ఒక్కరూ సద్భావన, సామాజిక సామరస్యాన్ని మరింత బలోపేతం చేయడానికి ప్రతిజ్ఞ చేయాలని అన్నారు. ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం సోషల్ మీడియా ‘X’లో రాసింది.

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X లో ఈద్ సందర్భంగా, రాష్ట్ర, దేశ ప్రజలకు, ముఖ్యంగా ముస్లిం సోదర సోదరీమణులకు హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు అని రాశారు. ఈ పవిత్రమైన రోజున దేవుడు మనందరికీ తన ఆశీస్సులను కురిపించి, రాష్ట్రానికి ఆనందం, శాంతి, శ్రేయస్సును ప్రసాదించుగాక. అంటూ రాసుకొచ్చారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Subscribe for notification
Verified by MonsterInsights