సమతుల్య ఆహారం తల్లి బిడ్డకు అవసరం… –

Written by RAJU

Published on:

సమతుల్య ఆహారం తల్లి బిడ్డకు అవసరం… –నవతెలంగాణ – తంగళ్ళపల్లి
సమతుల్య ఆహారం గర్భిణీ స్త్రీలకు, తల్లులకు, పిల్లలకు ఎంతో అవసరమని జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం అన్నారు. మండలంలోని నరసింహులపల్లె లో గురువారం బాబు  జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాల, జాతీయ సేవా పథకం విభాగం, జిల్లా శిశు, మహిళా సంక్షేమ శాఖ సంయుక్తంగా 7వ పోషణ పక్వాడ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ..సమతుల్య ఆహారం పిల్లలకు, స్త్రీలకు చాలా అవసరమని, పాలు, గ్రుడ్డు సమతుల్య ఆహారంలో భాగమని వివరించారు.మన దేశంలో 34 శాతం పిల్లలు పోషక లోపంతో బాధపడుతున్నారని పేర్కొన్నారు.కూరగాయలు పండ్లు రోజువారీ ఆహారంలో భాగంగా  తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ ఉమారాణి.కళాశాల యన్ ఎస్ ఎస్ నిర్వాహకులు, సహాయ ఆచార్యులు డా.మాధవి,సహాయ ఆచార్యులు డా. సంపత్ కుమార్, డా . హిందూజా,పాఠశాల ప్రధానోపాధ్యాయులు సరిత, గర్భిణీ స్త్రీలు, మహిళలు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights