
దేశంలో ఎక్కడా లేని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రవేశపెట్టిన సన్న బియ్యం పంపిణీ పథకం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం అని ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు.శుక్రవారం బొమ్మలరామారం మండల కేంద్రంలో ప్రభుత్వ చౌక ధరల దుకాణం ద్వారా లబ్ధిదారులకు పంపిణీ చేసే సన్న బియ్యాన్ని ఆయన ప్రారంభించారు .ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ.. కాంగ్రెస్ మేనిఫెస్టోలో సన్న బియ్యం పంపిణీ పథకం లేకపోయినా బడుగు బలహీన వర్గాల పేద ప్రజల ఆకలి నీ తీర్చడం కోసం వారికి కడుపునిండా భోజనం అందించాలన్న తలంపుతో రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న అవేమీ ఆలోచించకుండా సన్న బియ్యం పథకాన్ని అమలు చేయడం గర్వించదగ్గ విషయం అన్నారు మేనిఫెస్టోలో అమలు చేసిన ఆరు పథకాలను ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఒక్కొక్కటి అమలు చేయడానికి ప్రభుత్వం ముందు చూపుతో ఉన్నదని ఆయన అన్నారు మేనిఫెస్టో ప్రకారం డీలర్లకు ఇచ్చే గౌరవేతనం 5000 రూపాయల క్వింటాలుకు 300 రూపాయల కమిషన్ పై సంబంధిత శాఖ మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి దృష్టికి మరోసారి తీసుకువెళ్తా నని అన్నారు డీలర్ లు చొరవ చూపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సన్న బియ్యం పంపిణీ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో మదర్ డైరీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి ,తాసిల్దార్ శ్రీనివాసరావు, భువనగిరి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బైసు రాజేష్ ,మాజీ సర్పంచ్ రాంపల్లి మహేష్ గౌడ్ ,మాజీ ఎంపిటిసి సభ్యులు మైలారం ఈదమ్మ యాదయ్య, దేవస్థాన కమిటీ చైర్మన్ పండుగ రాజు, బొమ్మలరామారం రేషన్ షాప్ డీలర్ బేతాళ సంధ్యా శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మర్రి భగవంత రెడ్డి, మర్రి కృష్ణారెడ్డి, మల్లె బోయిన రఘు ,అందే మహేష్, షాదమ్ నగేష్, దాసరి నవీన్ ,మైలారం ఈశ్వ,ర్ తుడుం నరేష్, దేవతల రాజు జూపల్లి, నరసింహ, భైరబోయిన చంద్రయ్య ,బండి బొందయ్య ,బండి సత్యనారాయణ గౌడ్ ,నరసమ్మ రామిడి శ్రీనివాసరెడ్డి, దర్శన్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.