నిర్మాణానికి ముందుకొచ్చిన లారస్ ల్యాబ్ ఫార్మా సంస్థ
3 నెలల్లో పని పూర్తిచేస్తామని హామీ
అన్నవరం, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన సత్యదేవుని సన్నిధిలో భక్తుల సౌకర్యార్థం పశ్చిమ రాజగోపురం ఎదురుగా సత్యదేవ అతిథిగృహం తొలగించిన ప్రదేశంలో అత్యాధునిక సౌకర్యాల తో 170/100 అడుగులలో రూ.2.40 కోట్లతో టెన్‌సెల్ షెడ్డు నిర్మాణానికి ప్రముఖ ఫార్మాకంపెనీ లారస్ ల్యాబ్ సీఈవో సత్యనారాయణ చావా, ఎగ్జిక్యూటీవ్ డైరక్టర్ వివి.రవికుమార్ ముందుకొచ్చారు. శనివారం కుటుంబసభ్యులతో వారు స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహి ంచారు. వారికి ఆలయ ఈవో వీర్ల సుబ్బారావు, చైర్మన్ రోహిత్ ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు. దర్శనానంతరం వేదపండితులు వేదాశీర్వచనాలు నిర్వహించగా ఈవో, చైర్మన్ స్వామివారి ప్రసాదం, మెమెంటో అందజేశారు. వచ్చేనెల 2వ తేదీన తమ ఇంజనీరింగ్ బృందం పరిశీలన చేస్తారని అనంతరం 3 నెలల్లో పని పూర్తిచేస్తామని హామీఇచ్చారు. పైన షెడ్, క్రింద ఫ్లోరింగ్, టిక్కెట్టు కౌంటర్లు, భక్తులు వేచిఉండేందుకు ఎయిర్‌పోర్టు చైర్స్, స్పైరో ఫ్యాన్‌లు అమ ర్చనున్నట్టు దేవస్థానం ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. 2003 నవంబరులో ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చినా కొన్ని సాంకేతిక కారణాలతో ఈ నిర్మాణం నిలిచిపోయింది. గతేడాది డిసెంబరులో ఈవో వీర్ల సుబ్బారావు, చైర్మన్ రోహిత్ మరోసారి వారిని సంప్రదించి పనులు ప్రారంభించాలని కోరడంతో అంగీకరించారు. కా ర్యక్రమంలో ఇంజనీరింగ్ అధికారులు రామకృష్ణ, రాంబాబు, ఉదయ్‌కుమార్ తదితరులున్నారు.
భక్తుల కోసం నూతన కాటేజీ నిర్మాణం
పూర్తయిన టెండర్ల ప్రక్రియ
సత్యదేవుని సన్నిధికి విచ్చేసే భక్తులకు వసతిసౌకర్యం కల్పనకు నూతన సత్రం నిర్మాణానికి సన్నాహాలు చురుగ్గా జరుగుతున్నాయి. సీతారామసత్రం తొలగించి దానిలో ఒకబ్లాక్‌లో 105 గదులు నిర్మించాలని ఆలోచనతో రూ.8.81 కోట్ల అంచనాతో దేవస్థానం ఈ ప్రోక్యూర్‌మెంట్ టెం డర్‌ను పిలిచారు. అయితే ఇటీవల దేవస్థానానికి విచ్చేసిన దేవదాయశాఖ సాంకేతిక సలహాదారు, చీఫ్‌ఇంజనీర్, ఇతర సాంకేతిక నిపుణులు సీతారామసత్రం పడగొట్టకుండా మరమ్మతులు చేపడితే సరిపోతుందని నివేదిక ఇవ్వడంతో అవే నిధులతో సత్యగిరి కొండపై విష్ణుసదన్ ఎ దురుగా దేవదాయశాఖ కమిషనర్ అనుమతితో చేపట్టాలని నిర్ణయించారు. ఇటీవల తెరిచిన టెండర్లలో 11మంది పాల్గొనగా 19.80 శాతం లెస్‌కు శ్రీ డిడి కనస్ట్రక్షన్ కంపెనీ ఎల్ 1గా నిలిచినట్టు దేవస్థానం ఎట్జిక్యూటీవ్ ఇంజనీర్ రామకృష్ణ తెలిపారు. ఈ సత్రం నిర్మాణం పూర్తయితే సత్యదేవుడి దర్శనానికి విచ్చేసే భక్తులకు వసతికష్టాలు చాలావరకు గట్టెక్కనున్నాయి.
నేడు ఉగాది వేడుకలు
శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలకు సత్యదేవుని సన్నిధి ముస్తాబయింది. అని వేటి మండపంలోప్రత్యేక మండపం వేయించి వెండి సింహాసనంపై స్వామి,అమ్మవార్లను ఆశీనలు గావించి ప్రత్యేక పూజలు అనంతరం ఆదివా రం ఉదయం 9గంటలకు పంచాంగశ్రవణం, ఉగాది పచ్చడి వితరణ నిర్వహిస్తారు. 11 గంటలకు కొండపై స్వామి,అమ్మవార్లను వెండిరఽథంపై ఊరేగిస్తారు. రాత్రి 7గంటలకు కొండ దిగువున వెండి గజవాహనంపై గ్రామసేవ నిర్వహిస్తారు.
Updated Date – Mar 30 , 2025 | 12:32 AM