– రోజురోజుకూ పెరుగుతున్న రద్దీ
– రోడ్డుమీదే కూరగాయల విక్రయాలు
చిన్నచింతకుంట, మార్చి 16 (ఆంధ్రజ్యోతి) : మండల కేంద్రంలో ప్రతీ శుక్రవారం నిర్వహించే సంత.. అనేక సమస్యలకు నెలవుగా మారడంతో ప్రజలు సతమతమవుతున్నారు. పేరుకే మండల కేంద్రమైనా సంతకు తగ్గట్టుగా విశాలమైన స్థలం లేకపోవడంతో గ్రామం నడిబొడ్డున ఉన్న యూపీఎస్ ప్రభుత్వ బాలుర, బాలికల పాఠశాల ఎదుట ఇరుకైన రహదారిపైనే నిర్వహిస్తున్నారు. ఈ సంతకు కౌకుంట్ల మండలంలోని అప్పం పల్లి, దాసర్‌పల్లి, తిర్మలాపూర్, చిన్నచింతకుంట మండలంలోని గూడూరు, కురుమూర్తి, అమ్మా పూర్, అల్లీపూర్, మద్దూరు, ఉంద్యాల, చిన్నచింతకుంట, ఏదులాపూర్, చిన్న వడ్డెమాన్, పెద్ద వ డ్డెమాన్, దమాగ్నాపూర్, సీతారాంపేట, ఉంద్యాల తండా నుంచి సంతకు పెద్ద ఎత్తున విక్రయ దారులతో పాటు కొనుగోలు దారులు వస్తున్నారు. దీంతో రోడ్డు మీదే కూరగాయలు విక్రయి స్తుండగా విక్రయదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో ఆత్మకూర్, హైదరాబాద్ వెళ్ళే రోడ్డు జనంతో గజిబిజీగా మారుతోంది.
మౌలిక వసతులు కరువు
ఆయా గ్రామాల నుంచి సంతకు వచ్చే మహి ళలకు మూత్రశాలలు లేకపోవడంతో తిప్పలు తప్పటం లేదు. అదే విధంగా తాగునీటితో పాటు సంత బజారులో హైమాస్ట్ లైట్లు లేకపో వటంతో అటు కొనుగోలు దారులకు ఇటు విక్ర యదారులకు ఇబ్బందులు తప్పడం లేదు.
రోడ్డుపైనే మాంసం విక్రయాలు..
రోడ్డుపైనే మాంసం, చేపలు విక్రయిస్తుండ టంతో పాదాచారులకు దుర్వాసన వెదజల్లడంతో పాటు కుక్కల బెదద అధికంగా ఉందని పలువు రు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి మాంసం, చేపల విక్రయాలకు ప్రత్యే క స్థలం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.