షుగర్ ఉన్నవారు తీసుకోవాల్సిన టాప్ బెస్ట్ ఫుడ్స్ ఇవే.. వైద్య నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసా..?

Written by RAJU

Published on:

షుగర్ ఉన్నవారు తీసుకోవాల్సిన టాప్ బెస్ట్ ఫుడ్స్ ఇవే.. వైద్య నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసా..?

డయాబెటిస్ ఉన్నవారు తమ ఆహారంలో ఎలాంటి పదార్థాలు తీసుకుంటున్నారో చాలా జాగ్రత్తగా చూడాలి. కొన్ని ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిని వేగంగా పెంచుతాయి. అలాగే కొన్ని ఆహారాలు బ్లడ్ షుగర్‌పై తక్కువ ప్రభావం చూపుతాయి. వాటి గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

పనీర్

పనీర్‌ అనే పదార్థం ప్రోటీన్, కొవ్వుల వనరుగా నిలుస్తుంది. దీని గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉండటం వలన ఇది చక్కెర స్థాయిలను వేగంగా పెరగకుండా చేస్తుంది. ఇది శరీరానికి తగిన శక్తిని అందించడంతో పాటు.. డయాబెటిక్ వ్యక్తులు రోజూ మితంగా తీసుకుంటే మంచి ప్రయోజనం పొందవచ్చు.

కూరగాయల సలాడ్

టమాటా, క్యాప్సికమ్, దోసకాయ వంటి తాజా కూరగాయల ముక్కలతో తయారయ్యే వెజిటబుల్ సలాడ్‌లో గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇవి అధిక ఫైబర్ కలిగి ఉండటంతో చక్కెర శాతం నియంత్రణలో ఉండేలా సహాయం చేస్తాయి. అదనంగా ఇవి జీర్ణవ్యవస్థకు కూడా బాగా ఉపయోగపడతాయి.

మెంతులు

మెంతులు ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో ఎంతో సహాయపడతాయి. ఇది రక్తంలో చక్కెర శాతం నియంత్రణకు దోహదపడుతుంది. ప్రతి రోజు తక్కువ మొత్తంలో మెంతులును ఆహారంలో కలిపి తీసుకుంటే దీర్ఘకాలిక ప్రయోజనాలు చక్కగా కనిపిస్తాయి.

పాలకూర వంటి ఆకు కూరలు

పాలకూర, తోటకూర, బచ్చలికూర వంటి ఆకుకూరల్లో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. ఇవి ఫైబర్‌తో నిండి ఉండటంతో గ్లూకోజ్ మెల్లగా గ్రహించబడుతుంది. ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయి స్థిరంగా ఉంటుంది. రోజూ ఆకుకూరలు తీసుకోవడం డయాబెటిక్ రోగులకు చాలా మేలు చేస్తుంది.

పప్పులు

పప్పుల వంటకాలు పుష్కలమైన ప్రోటీన్, ఫైబర్‌ను కలిగి ఉంటాయి. గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వలన ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యంగా ఉంచే శక్తి కలిగి ఉంటాయి. ఉప్పు తక్కువగా వేసి వండిన పప్పులు ఆరోగ్యానికి మరింత మంచివి.

పసుపు

పసుపులో ఉండే కర్క్యుమిన్ అనే సహజ పదార్థం శరీరంలో ఇన్ఫ్లమేషన్‌ను తగ్గించడంలో పనిచేస్తుంది. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలవల్ల చక్కెర స్థాయిలను మెరుగుగా నియంత్రించగలదు. పసుపును రోజూ వంటల్లో తగినంతగా ఉపయోగించడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.

పెరుగు

పెరుగులో ప్రోబయోటిక్స్ అధికంగా ఉండటం వలన జీర్ణవ్యవస్థ బలపడుతుంది. ఇది శరీరంలో మంచి బ్యాక్టీరియాను పెంపొందించి.. బ్లడ్ షుగర్ స్థాయిలను కంట్రోల్ చేయడంలో సహాయపడుతుంది. మంచి ఫ్యాట్ ఫ్రీ పెరుగు రోజూ తీసుకుంటే శరీరానికి మేలు చేస్తుంది.

టమాటా

టమాటాల్లో గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇవి యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ C, ఫైబర్ పుష్కలంగా కలిగి ఉంటాయి. కార్బోహైడ్రేట్లు, కేలరీలు తక్కువగా ఉండటం వలన ఇవి డయాబెటిస్ ఉన్నవారికి సరైన ఆహారంగా పరిగణించబడతాయి.

చియా గింజలు

చియా గింజల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మందగింపజేసి గ్లూకోజ్ రక్తంలో వేగంగా పెరగకుండా అడ్డుకుంటాయి. ఇది బ్లడ్ షుగర్ లెవెల్ నియంత్రణకు సహాయపడుతుంది.

ఈ పదార్థాలు అన్నీ శరీరానికి మేలు చేసే ఆహారాలు అయినప్పటికీ అవి ఒక్కొక్కరి ఆరోగ్య పరిస్థితులకు అనుగుణంగా ప్రభావం చూపుతాయి. కాబట్టి ఈ ఆహారాలను మితంగా తీసుకోవడమే మంచిది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights