
మండల కేంద్రంలోని హాస కొత్తూర్ రోడ్డులో గల శ్రీ విద్యా సాయి ఉన్నత పాఠశాలను రాష్ట్ర మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంతి రెడ్డి శనివారం సందర్శించారు. పాఠశాలను నెలకొల్పి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న వేడుకల్లో పాలుపంచుకోవాలని కోరుతూ పాఠశాల యాజమాన్యం ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి శ్రీ విద్యా సాయి ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాల యాజమాన్యానికి, ఉపాధ్యాయ బృందానికి వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిని పాఠశాల యాజమాన్యం, కరస్పాండెంట్ ఏనుగు గంగారెడ్డి దంపతులు శాలువాతో ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పెరుమండ్ల రాజా గౌడ్, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రేగుంట దేవేందర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాలావత్ ప్రకాష్, మాజీ ఎంపీటీసీ సభ్యులు అంగరి రాజేశ్వర్, మైలారం సుధాకర్, మాజీ సర్పంచ్ గడ్డం స్వామి, నాయకులు రేంజర్ల మహేందర్, కటికే శ్రీనివాస్, పాఠశాల డైరెక్టర్ ఏనుగు ప్రమీల గంగారెడ్డి, ఉపాధ్యాయ బృందం సభ్యులు పవన్, శ్రీనివాస్, షాలిని, జాన్, శేఖర్, తదితరులు పాల్గొన్నారు.