నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణంలోని శ్రీ నవనాథ సిద్దుల గుట్ట యందు శ్రీరామనవమి సందర్భంగా శనివారం కళ్యాణానికి రామాలయం ముందర పచ్చటి మామిడి తోరణాలతో కళ్యాణ పందిరి వేసినారు. ఈ కార్యక్రమానికి శ్రీశ్రీ నందీశ్వర మహారాజు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వినయ్ రెడ్డి, పండిత్ పవన్ లు పాల్గొని పేద మంత్రోచ్ఛారణాల మధ్య పందిరి వేసినారు. భద్రాచలం లోని ఏ విధంగా సీతారాముల కళ్యాణం జరుగుతుందో అదే విధంగా అంగరంగ వైభవంగా ఉదయము నుండే అన్న ప్రసాద వితరణ , కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తున్నట్టు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. సిద్దుల గుట్టకు వచ్చే భక్తులకు ఏ లాంటి ఇబ్బందులు కలగకుండా సీలింగ్ టెంట్లు, చల్లటి మంచినీళ్లను ఏర్పాటు చేసినారు .ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు బి సుమన్, పిసి గంగారెడ్డి, ప్రశాంత్ గౌడ్, హజారి సంతోష్ ,కొంతం మంజుల, మురళి, చరణ్ రెడ్డి, సిద్దులగుట్ట సేవా భక్తులు తదితరులు పాల్గొన్నారు.