
ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం గ్రామంలో సమ్మక్క ప్రధాన పూజారి సిద్ధబోయిన సురేందర్- రాజ్యలక్ష్మి చి. ల. సౌ కీర్తన, విష్ణు ప్రియ ఇద్దరి కుమార్తెల పుష్పాలంకరణ వేడుకలకు గురువారం కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా నాయకురాలు మడే పూర్ణిమ, పూజార్ల సంఘం అధ్యక్షులు సిద్ధబోయిన జగ్గారావు సతిమని భారతి, ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మడి బిక్షపతి లు హాజరయ్యారు. చిన్నారులను ఆశీర్వదించి దీవించారు. భవిష్యత్తులో ఉన్నత చదువులు చదివి అత్యుత్తమ స్థాయిలో ఎదగాలని ఆకాంక్షించారు. ఆమె వెంట భారతక్క, బిక్షపతి, మహిళలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.