శివ భక్తుడిగా మారిపోయా.. –

Written by RAJU

Published on:

శివ భక్తుడిగా మారిపోయా.. –హీరో విష్ణు మంచు నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘కన్నప్ప’. అవా ఎంటర్టైన్మెంట్స్‌, 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్‌ బాబు నిర్మించిన ఈ చిత్రానికి ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వం వహించారు. ఈ మూవీని ఏప్రిల్‌ 25న విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా రెడ్‌ లారీ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప’ సందడి చేసింది. ఈ సందర్భంగా విష్ణు మంచు మాట్లాడుతూ, ”నేను మామూలుగా ఆంజనేయ స్వామి భక్తుడ్ని. కానీ ‘కన్నప్ప’తో ప్రయాణం ప్రారంభం అవ్వడంతో శివ భక్తుడిగా మారిపోయాను. ఈ సినిమా అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. ప్రభాస్‌ పాత్రను ఎంత ఊహించుకున్నా.. అంతకు మించి అనేలా ఉంటుంది. సినిమా కూడా అదే స్థాయిలో ఉంటుంది. ఏప్రిల్‌ 25న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా భారీ ఎత్తున రిలీజ్‌ కాబోతోంది’ అని అన్నారు. ”కన్నప్ప’ లాంటి గొప్ప చిత్రంలో ఓ మంచి పాత్రను వేయడం నా అదష్టం. ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థ్యాంక్స్‌. మా కెరీర్‌ ‘కన్నప్ప’కి ముందు.. ‘కన్నప్ప’కి తరువాత అన్నట్టుగా మారుతుంది. విష్ణు నటన చూసి అంతా ఫిదా అవుతారు. మైండ్‌ బ్లోయింగ్‌ అనేలా సినిమా ఉంటుంది’ అని బ్రహ్మాజీ చెప్పారు. రఘుబాబు మాట్లాడుతూ, ‘ఈ సినిమా అద్భుతంగా వచ్చింది. విష్ణు ఈ చిత్రంతో మరో స్థాయికి వెళ్తారు’ అని అన్నారు. ‘నేను దర్శకత్వం వహించిన ‘మహా భారతం’ సీరియల్‌ను అందరూ ప్రేమించారు. ‘కన్నప్ప’ని కూడా అదే స్థాయిలో అందరూ ప్రేమిస్తారు.. గౌరవిస్తారు. మోహన్‌ బాబు, ప్రభాస్‌, మోహన్‌ లాల్‌ వంటి హేమాహేమీలు ఎంతో మంది ఈ చిత్రంలో నటించారు’ అని దర్శకుడు ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ చెప్పారు.

Subscribe for notification