శివశక్తి క్యారెక్టర్‌ చేయడం నా అదృష్టం : తమన్నా

Written by RAJU

Published on:

శివశక్తి క్యారెక్టర్‌ చేయడం నా అదృష్టం : తమన్నాతమన్నా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఓదెల 2’. సూపర్‌ నేచురల్‌ థ్రిల్లర్‌ ‘ఓదెల రైల్వే స్టేషన్‌’కి ఇది సీక్వెల్‌. ఈ చిత్రాన్ని పాన్‌-ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నారు. సంపత్‌ నంది కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్‌ రైటర్‌గా మల్టిపుల్‌ రోల్స్‌లో వర్క్‌ చేశారు. అలాగే డైరెక్షన్‌ సూపర్‌ విజన్‌ని అందిస్తున్నారు. అశోక్‌ తేజ ఈ చిత్రానికి దర్శకుడు. మధు క్రియేషన్స్‌, సంపత్‌ నంది టీమ్‌వర్క్స్‌ బ్యానర్స్‌ పై డి. మధు నిర్మిస్తున్నారు. ఇటీవల ముంబైలో జరిగిన గ్రాండ్‌ ఈవెంట్‌లో మేకర్స్‌ థియేట్రికల్‌ ట్రైలర్‌ను లాంచ్‌ చేశారు.
ఈ సందర్భంగా హీరోయిన్‌ తమన్నా మాట్లాడుతూ,’ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకం. ఇలాంటి సినిమాలు ఒక యాక్టర్‌కి చాలా అరుదుగా వస్తుంటాయి. ఈ సినిమాలో పార్ట్‌ కావడం ప్రౌడ్‌గా ఫీల్‌ అవుతున్నాను. సంపత్‌ నంది ఈ సినిమాలో నా పాత్రని రాసిన విధానం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇలాంటి అద్భుతమైనటువంటి కథలో నన్ను పార్ట్‌ చేసిన ఆయనకు కతజ్ఞతలు తెలుపుతున్నాను. వశిష్ట సింహ చాలా అద్భుతమైన నటుడు. ఈ సినిమాల్లో తన పాత్ర టెర్రిఫిక్‌గా ఉంటుంది. గాడ్‌ వర్సెస్‌ ఈవిల్‌ ఫైట్‌ని తన పెర్ఫార్మన్స్‌తో మరో స్థాయికి తీసుకు వెళ్లాడు. ఈ సినిమాలో నేను చేసిన శివశక్తి పాత్రకు ఎలాంటి రిఫరెన్స్‌ లేదు. ఇంత మంచి క్యారెక్టర్‌ పోషించడం చాలా అదృష్టంగా ఫీలవుతున్నాను. ఈ సినిమా కోసం నేచర్‌ కూడా మాకు సపోర్ట్‌ చేసిందని నమ్ముతున్నాం. ఈ సినిమా నాకు చాలా డిఫరెంట్‌ జర్నీ. ఇది గ్రాండ్‌ స్కేల్‌ కమర్షియల్‌ ఫిల్మ్‌. ఈ సినిమా అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది’ అని అన్నారు.
‘తమన్నా ఈ సినిమాలో శివశక్తి పాత్రని మరో స్థాయిలో చేశారు. సినిమా కోసం చాలా హార్డ్‌ వర్క్‌ చేశారు. మండుటెండలో చెప్పులు లేకుండా నడిచారు. ఈ సినిమా తర్వాత ఆమెకు డిఫరెంట్‌ రోల్స్‌ వస్తాయి. ఆమె కోసం పాత్రలు క్రియేట్‌ అవుతాయి. ప్రేక్షకులకి ఈ సినిమా గ్రేట్‌ సినిమాటిక్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇస్తుంది. ఈనెల 17న థియేటర్స్‌లో సినిమా చూడండి. ఖచ్చితంగా బ్లాస్టింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఉంటుంది’ అని సంపత్‌ నంది చెప్పారు. వశిష్ట సింహ మాట్లాడుతూ,’ఇది చాలా పవర్‌ ఫుల్‌ మూవీ. నిర్మాత మధు ఈ సినిమాని చాలా బిగ్‌ స్కేల్‌లో తీశారు. తమన్నా ఈ సినిమాలో చేయబోయే మ్యాజిక్‌ చూడబోతున్నారు. నేను నటించిన ‘కేజిఎఫ్‌’ మాస్‌ ఎక్స్‌పీరియన్స్‌. ఈ సినిమా ఒక డివైన్‌ ఎక్స్పీరియన్స్‌లా ఉండబోతుంది’ అని తెలిపారు.

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights