దేశ వ్యాప్తంగా హోలీ సంబరాలు మొదలయ్యాయి. ప్రముఖ పుణ్యక్షేత్రం వారణాసిలో హోలీ సెలబ్రేషన్స్ మూడు రోజుల ముందుగానే ప్రారంభమయ్యాయి. మణికర్ణిక ఘాట్‌లో హోలీ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు పెద్ద ఎత్తున జనం హాజరయ్యారు. ఢమరుకాలు మోగిస్తూ అక్కడి వారంతా సందడి చేశారు. పెద్ద సంఖ్యలో జనం రావడంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
మరో మూడు రోజుల్లో దేశవ్యాప్తంగా ప్రజలు హోలీ పండగ సెలబ్రేట్ చేసుకోనున్నారు. హోలీ పండగ అంటే.. రకరకాల రంగులు గుర్తుకు వస్తాయి. రంగు రంగుల గులాల్ ఒకరిపై ఒకరు చల్లుకుంటూ సందడి చేస్తారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో దాదాపుగా ఇలాగే ప్రతి ఒక్కరు ఈ పండగను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే హోలీ పండుగను శ్మశానంలో లభించే చితిభస్మంతో జరుపుకంటారనే విషయం మీలో ఎంత మందికి తెలుసు?యస్.. శ్మశానంలో చితిపై కాలిన భౌతిక కాయం తాలుక బూడిదతో హోలీ పండగను జరుపుకుంటారు.
విశ్వేశ్వరుడు కొలువు తీరిన వారణాసి క్షేత్రంలో శ్మశానంలో దొరికే బూడిదతో హోలీ వేడుకలు జరుపుకుంటారు. ఈ హోలీని మసాన్‌కి హోలీ, మసాన్ హోలీ అని అక్కడి వారు పిలుచుకుంటారు. వారణాసిలోని హరిశ్చంద్ర ఘాట్‌లో మహా శ్మశాన్ హారతి అనంతరం మసాన్‌కి హోలీ జరుపుకున్నారు. ఈ హోలీ వేళ.. సాధువులు, శివ భక్తులు.. పరమ శివుడిని పూజించిన అనంతరం చితి కాలిన అనంతరం వచ్చిన బూడిదతో హోలీ నిర్వహిస్తారు.
మసాన్ హోలీ సమయంలో మణికర్ణికా ఘాట్.. హరిహర్ మహాదేవ్ అనే నామ స్మరణతో మార్మోగింది. . అయితే చితి నుంచి వచ్చిన బూడిదతో హోలీ ఆడటం వల్ల.. శివుడుకి ఆనందం, ఆయన భక్తులకు శ్రేయస్సుతోపాటు ఆశీర్వాదం లభస్తోందనే విశ్వాసం ఉంది. ఈ నేపథ్యంలో మసాన్ హోలీ నిర్వహిస్తారు.