శరీరానికి కావాల్సిన పోషకాలు అందించే టాప్ బెస్ట్ ఫుడ్స్ ఇవే..!

Written by RAJU

Published on:

శరీరానికి కావాల్సిన పోషకాలు అందించే టాప్ బెస్ట్ ఫుడ్స్ ఇవే..!

ఆహారం మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే ముఖ్యమైన అంశం. సరైన ఆహారం తీసుకుంటే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పోషక విలువలతో నిండిన కొన్ని ప్రత్యేకమైన ఆహారాలను రోజూ తీసుకోవడం వల్ల శరీరానికి తగిన న్యూట్రియంట్స్ అందుతాయి. ఆహారం ద్వారా శరీరానికి తగిన ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు అందిస్తే ఆరోగ్య సమస్యల నుండి రక్షణ పొందవచ్చు.

నల్ల నువ్వులు

నల్ల నువ్వులు పోషకాలతో నిండి ఉంటాయి. ఇందులో అధికంగా కాల్షియం, ఐరన్ ఉండటం వల్ల ఎముకలకు చాలా మేలు చేస్తాయి. వీటిని తరచుగా ఆహారంలో చేర్చుకుంటే ఎముకలు బలంగా మారటమే కాకుండా శక్తివంతంగా మారుతాయి. నువ్వుల నూనెను వాడడం వల్ల చర్మ ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది.

మఖానా

మఖానా తక్కువ క్యాలరీలతో పాటు మంచి పోషకాలను కలిగి ఉంటుంది. వీటిని తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. మఖానాలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటంతో ఇవి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. పొడిగా ఉండే మఖానాను కాస్త వేయించి తినడం వల్ల రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యకరంగా కూడా ఉంటుంది.

కలోంజీ గింజలు

కలోంజీ గింజల్లో అనేక పోషకాలు ఉండటంతో శరీరానికి ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. ఇవి జీర్ణ వ్యవస్థను మెరుగుపరచటంతో పాటు కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి. ప్రతి రోజు తక్కువ మోతాదులో కలోంజీ గింజలు తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.

మొలకలు

మొలకలు ప్రోటీన్, ఫైబర్, ఖనిజలతో నిండి ఉంటాయి. ఇవి జీర్ణ సమస్యలను తగ్గించటంతో పాటు శరీరానికి తగిన విటమిన్లను అందిస్తాయి. మొలకలు తినడం వల్ల రక్తహీనత సమస్య తగ్గిపోతుంది. వీటిని ఉడికించి లేదా పచ్చిగా తీసుకోవచ్చు.

ఉసిరి

ఉసిరిలో విటమిన్ C అధికంగా ఉండటంతో ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచటంతో పాటు జీర్ణ సంబంధిత సమస్యలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ఉసిరి తినడం వల్ల శరీరంలో టాక్సిన్స్ బయటికి పోయి ఆరోగ్యంగా ఉండొచ్చు.

పనస

పనసలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. దీనిలో విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉండటంతో శరీరానికి తగిన పోషకాలు అందుతాయి. పనస తినడం వల్ల గట్ హెల్త్ మెరుగుపడుతుంది.

బాదం

బాదంలో శరీరానికి అవసరమైన ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి మెదడు పనితీరును మెరుగుపరచటంతో పాటు శరీరానికి తగిన శక్తిని అందిస్తాయి. బాదాన్ని రాత్రి నీటిలో నానబెట్టి తినడం వల్ల ఇంకా మంచి ప్రయోజనాలు పొందవచ్చు.

మిల్లెట్స్

మిల్లెట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ధాన్యాలు. వీటిలో ఫైబర్, ప్రోటీన్ అధికంగా ఉండటం వల్ల ఇవి శరీరానికి పోషకాలను అందించడంలో సహాయపడతాయి. మిల్లెట్స్‌ను ఆహారంలో చేర్చుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడటమే కాకుండా బరువు అదుపులో ఉంటుంది. ఈ ఆరోగ్యకరమైన ఆహారాలను ప్రతిరోజూ డైట్‌లో చేర్చుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

Subscribe for notification
Verified by MonsterInsights