– విరివిగా సందర్శకుల రాక..
నవతెలంగాణ – అశ్వారావుపేట
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల వ్యవసాయ విజ్ఞాన వేదికగా రూపొందుతుంది. ఈ కళాశాల విద్యార్ధులు పరిశీలన,పరిశోధనార్ధం కళాశాల ప్రాంగణం సాగు చేస్తున్న అనేక పరిశోధనా పంటలు మెరుగైన ఫలితాలు ఇవ్వడం తో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ పలుమార్లు ఈ క్షేత్రాలను సందర్శించడం తో బహు ప్రచారం జరిగింది. దీంతో ఔత్సాహిక రైతులు,పలు పాఠశాలల,కళాశాల విద్యార్ధులు సందర్శించడం తో విశేష ఆదరణ లభిస్తుంది. ఈ నేపధ్యంలో గురువారం ఖమ్మం జిల్లా లోని వైరా, ఎర్రుపాలెం లోగల తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలల విద్యార్ధులు ఎర్రుపాలెం నుండి సుమారు 350 విద్యార్ధినీ లు అశ్వారావుపేట కళాశాలలో క్షేత్ర సందర్శనకు వచ్చారు. పీఎం శ్రీ స్కూల్స్ కార్యాచరణలో భాగంగా ఈ కళాశాల క్రాప్ కెప్టేరియాలో వివిధ పప్పు దినుసుల,జొన్న, ప్రొద్దు తిరుగుడు,జంట సాల పద్ధతి లోని మొక్కజొన్న,ఏఈ ఎల్పీ విద్యార్ధులు సాగు చేస్తున్న వివిధ కూరగాయల పంటల,కొబ్బరి లోని అంతర పంటలు,25 రకాల ప్రముఖ మామిడి జాతులు, అధిక సాంద్రత పద్ధతిలో మామిడి, మునగ సాగు, మొదలైనవి వీక్షించి, వ్యవసాయ సాంకేతికతను నేర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అసోసియేట్ డీన్ జే.హేమంత్ కుమార్, వ్యవసాయ విద్యా శాస్త్రవేత్తలు దీపక్ రెడ్డి, చరిత, లక్ష్మణ్, తేజస్వినిలు సాగు గురించి గురుకుల పాఠశాల విద్యార్ధులకు వివరించారు. ఆయా కళాశాలల ప్రిన్సిపాల్ లు సమత, కే.శ్రీలత, సిబ్బంది ఎస్.కే షాహిన్ సుల్తాన్, నాగలక్ష్మి, భవాని, శ్వేత, అనిల్ కుమారి, రాణి, సంధ్యా ప్రియాంక, చైతన్య, ధనలక్ష్మి, అరుణ, ఝాన్సి రాణి లు పాల్గొన్నారు.