వైసీపీ హయంలో జరిగిన మద్యం కుంభకోణంపై ప్రభుత్వం మరిన్ని విషయాలు సేకరించింది. మద్యం కుంభకోణాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. దీనిలో ఎవరి పాత్ర ఎంత ఎలా దోచుకున్నారన్న విషయాలపై సమగ్ర విచారణ చేస్తోంది. ప్రత్యేక దర్యాప్తు బృందం.. ఈ క్రమంలో లోతైన విచారణ చేసి.. బలమైన ఆధారాలను కూడా సేకరిస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీ పెద్దలకు ముడుపులు 3000 కోట్ల రూపాయలకు పైగానే చేరినట్టు అధికారులు గుర్తించారు.
అదికూడా.. బాటిల్.. బాటిల్‌కు ఇంతని లెక్కగట్టి తయారీ దారుల(డిస్టిలరీ) నుంచే కాకుండా.. సరఫరా దారుల నుంచి కూడా సొమ్ములు రాబట్టినట్టు అధికారులు పేర్కొన్నారు. తాజాగా సుప్రీంకోర్టుకు సమర్పిం చిన అఫిడవిట్లో ఆయా వివరాలను వెల్లడించడంతో అసలు విషయం వెలుగు చూసింది. ఒక కేసుకు(12 బాటిళ్లు) ఇంతని చెప్పి.. లంచాలు, ముడుపులు లెక్క గట్టి.. వసూలు చేసినట్టు అధికారులు తెలపడం సంచలనంగా మారింది. అంతేకాదు.. ఇది ఢిల్లీలో వెలుగు చూసిన మద్యం కుంభకోణం కన్నా కూడా పెద్దదేనని అధికారులు చెబుతున్నారు.
దీనిలో ప్రధానంగా ఎంపీ మిథున్‌రెడ్డి పాత్ర ఎక్కువగా ఉందని అధికారులు చెబుతున్నారు. ఆయనే అన్నీ దగ్గరుండి.. ఎవరి నుంచి ఎంత రాబట్టాలి…? ఏయే బ్రాండ్స్ను ఆపివేయాలి? ఏయే బ్రాండ్స్‌ను.. అనుమతించాలి..? ఈ క్రమంలో ఎవరికి ఎంత ముడుపులు దక్కాలన్న లెక్కలు కూడా వేసినట్టు పూసగు చ్చినట్టు వివరించారు. ఆయా వివరాలను ససాక్ష్యాలతో కలిపి..సుప్రీంకోర్టుకు వివరించడం.. సంచలనంగా మారింది.
అంతేకాదు.. ముడుపుల వ్యవహారాన్ని తొలినాళ్లలో కెసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి, వాసుదేవరెడ్డి, సజ్జల శ్రీధర్‌రెడ్డి చూడగా.. తర్వాత ఐఏఎస్ అధికారి వాసుదేవరెడ్డి రంగంలోకి దిగారు. ఆయన కూడా వాటాలు పంచుకున్నారు. ఇక, పూర్తిస్థాయిలో అవినాష్‌రెడ్డి, బూనేటి చాణక్యలు ఫుల్లుగా దోచేశారని అధికారులు పేర్కొనడం గమనార్హం.
ఇదీ లెక్క..
+ వైసీపీ హయాంలో ప్రతి నెలా 27-30 లక్షల కేసుల ఐఎంఎల్, 7-10 లక్షల కేసుల బీర్లు విక్రయించారు.
+సదరన్ బ్లూ, 9 హార్సెస్, ఆంధ్రా గోల్డ్, హెచ్‌డీ విస్కీలాంటి బ్రాండ్లకు కేసుకు రూ.150(అంటే.. బాటిల్‌కు 12 రూపాయల చొప్పున) లాగేశారు.
+ హైదరాబాద్‌లో తయారయ్యే దారూహౌస్, రాయల్ ప్యాలెస్, బ్రిలియంట్ బ్లెండ్‌లకు కేసుకు రూ.200 చొప్పున గుంజారు.
+ మరికొన్ని బ్రాండ్లకు కేసుకు రూ.350 చొప్పున వసూలు చేశారు.
+ మధ్యతరగతి వారు తీసుకునే హైఎండ్ బ్రాండ్లకు కేసుకు రూ.600 చొప్పున ముడుపులు తీసుకున్నారు.
The post వైసీపీ మద్యం మాఫియా: బాటిల్.. బాటిల్‌కు రేటు కట్టి దోచేశారు! first appeared on namasteandhra.