వైద్యశాఖలో కొలువుల జాతర! భారీగా పోస్టుల భర్తీ!

Written by RAJU

Published on:


ABN
, First Publish Date – 2023-05-01T12:49:24+05:30 IST

వైద్య ఆరోగ్యశాఖలో (Medical Health Department) కొలువులు జాతర కొనసాగుతోంది. కొత్తగా మరో 1,827 స్టాఫ్‌నర్స్‌ పోస్టుల భర్తీకి సర్కారు గ్రీన్‌ సిగ్నల్‌

వైద్యశాఖలో కొలువుల జాతర! భారీగా పోస్టుల భర్తీ!

Medical Health Department

1,827 స్టాఫ్‌నర్స్‌ పోస్టులకు గ్రీన్‌ సిగ్నల్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 30(ఆంధ్రజ్యోతి): వైద్య ఆరోగ్యశాఖలో (Medical Health Department) కొలువులు జాతర కొనసాగుతోంది. కొత్తగా మరో 1,827 స్టాఫ్‌నర్స్‌ పోస్టుల భర్తీకి సర్కారు గ్రీన్‌ సిగ్నల్‌ (KCR Government) ఇచ్చింది. దీంతో మెడికల్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు, టీఎ్‌సపీఎస్సీల ద్వారా మొత్తం 14,562 పోస్టులు భర్తీ కానున్నాయి. ఇందులో ఇప్పటికే 960 మంది ఎంబీబీఎస్‌ వైద్యుల నియామక ప్రక్రియను మెడికల్‌ బోర్డు పూర్తిచేసింది. 5,204 స్టాఫ్‌నర్స్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ జారీచేసింది. 1,442 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు కూడా గత ఏడాది డిసెంబరు 6న నోటిఫికేషన్‌ ఇవ్వగా.. నేడో రేపో మెరిట్‌ లిస్టు విడుదల కానుంది. మే మొదటి వారంలో వీరికి కౌన్సెలింగ్‌ నిర్వహించి, పోస్టింగ్స్‌ ఇవ్వనున్నారు. వాస్తవానికి వైద్య ఆరోగ్యశాఖలో 12,735పోస్టుల భర్తీకి సర్కారు గతంలో గ్రీన్‌ సిగ్నలిచ్చింది. ఆమేరకు ఆర్ధికశాఖ వేర్వేరు జీవోలను జారీ చేసింది. వీటిల్లో 10,028 పోస్టులను మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ద్వారా భర్తీ చేయాలని నిర్ణయించింది. మిగతా 2,662 పోస్టులను టీఎస్‌పీఎస్సీ (TSPSC) ద్వారా భర్తీ చేయనుంది. ఆయు్‌షకు చెందిన 689 పోస్టులను టీఎస్‌పీఎస్సీ మినహాయించింది. వాటిని మెడికల్‌ బోర్డు ద్వారానే భర్తీ చేయాలని నిర్ణయించింది

Updated Date – 2023-05-01T12:49:24+05:30 IST

Subscribe for notification