
నవతెలంగాణ – తాడ్వాయి
వేసవి సీజన్ ప్రారంభంలో నే ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు 38 డిగ్రీలు దాటుతుంది. ప్రజలు ఎండ వేడి ని తట్టుకోలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే వడదెబ్బకు గురై వాంతులు, విరోచనాలతో అస్వస్థకు గురయ్యే అవకాశముంది. ముందస్తు చర్యలు తీసుకోవాలని, లక్షణాలు కనిపించిన వెంటనే ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతే ప్రాణాపాయ స్థితి నుండి బయటపడవచ్చు అని ఇలా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సూచిస్తున్నారు. శనివారం నవ తెలంగాణ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు.
వైద్య సిబ్బందిని అప్రమత్తం చేశాం ..
వైద్య సిబ్బందిని అప్రమత్తం చేశాం. వడదెబ్బ బారిన పడకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తూ, ప్రజల్లో, కూలీలు, కార్మికులు, విద్యార్థులలో అవగాహన తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నాం. ప్రచార కరపత్రాలు పంపిణీ చేసాం. సిబ్బందితోపాటు పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడి టీచర్ల సహకారంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.
తల, శరీరానికి ఎండ తగలకుండా చూసుకోవాలి ..
కూలీలు, కార్మికులు చల్లగా ఉండే సమయాల్లోనే పనులు చేయాలి ఉదయం 10 గంటల లోపు సాయంత్రం నాలుగు గంటల తర్వాత బయటకు వెళ్లాలి. మంచి నీటితో పాటు నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరినీళ్లు, ఓఆర్ఎస్ ద్రావణం తాగాలి. బయటకు వెళ్ళినప్పుడు కాటన్ దుస్తులు ధరించాలి.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అత్యవసర సేవలు ..
ప్రతి ఆరోగ్య కేంద్రంలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఆర్ ఎల్, ఎన్ ఎస్ ఎస్ గ్లూకోజ్ బాటిల్ అందుబాటిళ్లు అందుబాటులో ఉన్నాయి. అత్యవసరమైన మాత్రలు నిల్వ ఉన్నాయి. ప్రతి ప్రాథమిక కేంద్రంలో అత్యవసర సేవలు అందుతాయి. అంతేకాకుండా మంగపేట, ఏటూరు నాగారం, వాజేడు, పేరూరు హాట్ స్పాట్ ప్రాంతాలలో మిరప తోటలలో, ఇసుక ర్యాంపుల వద్ద పనిచేసే కూలీలకు తొందరగా వడదెబ్బ కలిగే అవకాశం ఉన్నందున వీరికి ప్రతిరోజు ఆశలు ఏఎన్ఎంలు అందుబాటులో ఉంటారు. వారానికి రెండుసార్లు మెడికల్ ఆఫీసర్లు వచ్చి పరిశీలించే విధంగా ప్రణాళిక ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎండ దెబ్బ తగిలిన వ్యక్తులకు హానికలకుండా అన్ని చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
చిన్నపిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి ..
వేసేవిలో చిన్న పిల్లలు జాగ్రత్తగా చూసుకోవాలి. చికెన్ ఫాక్స్, మీజిల్స్ వ్యాధులు వస్తుంటాయి. వారు ఎండలో ఎక్కువగా ఆటలు ఆడకుండా బయట తిరగకుండా చూసుకోవాలి.