వెండితెరపై జగ్గారెడ్డి జీవితం.. –

Written by RAJU

Published on:

వెండితెరపై జగ్గారెడ్డి జీవితం.. –ఉగాది పండగ నేపథ్యాన్ని పురస్కరించుకుని మాస్‌ లీడర్‌, జననేత జగ్గారెడ్డి సినిమా ఆఫీస్‌ లాంఛనంగా ప్రారంభించడంతోపాటు ‘జగ్గారెడ్డి’ టైటిల్‌తో సినిమాని ఆయన కుమార్తె జయలక్ష్మీ రెడ్డి , భరత్‌ సాయి రెడ్డి ప్రారంభించారు. విద్యార్థి నాయకుడిగా ప్రయాణం మొదలు పెట్టి అంచెలంచెలుగా రాష్ట్ర నాయకుడిగా ఎదిగిన జగ్గారెడ్డి రాజకీయాల్లో అందరికీ ఆదర్శం. ఆయన సినిమా రంగంలోకి అడుగుపెడుతూ, కథలో టైటిల్‌ రోల్‌ పోషిస్తున్నారు. ఈ సినిమా ప్రీపొడక్షన్‌ పనులు శరవేగంగా నడుస్తున్నాయి. ఈ సందర్భంగా మూవీ గ్లింప్స్‌ని చిత్ర బృందం రిలీజ్‌ చేసింది.
ఈ సందర్భంగా మాస్‌ లీడర్‌ జగ్గారెడ్డి మాట్లాడుతూ, ‘దర్శకుడు రామానుజం చూపించిన ‘జగ్గారెడ్డి వార్‌ ఆఫ్‌ లవ్‌’ పోస్టర్‌కి బాగా ఎట్రాక్ట్‌ అయ్యా. ఆతర్వాత ఆయన చెప్పిన కథ నాకు నచ్చింది. అందులో నా పాత్ర నాదే. ఎవరో రాసిన మాటలు, పాత్రలుగా నేను ఉండను. అంతా ఒరిజినల్‌. మీకు తెలిసిన జగ్గారెడ్డిని తెరమీద చూస్తారు. విద్యార్థి నాయకుడిగా మొదలైన నా ప్రయాణం రాష్ట్ర నాయకుడి వరకూ వచ్చిందంటే అందులో చాలా మలుపులున్నాయి. కుట్రలు, కుతంత్రాలు, హత్యా ప్రయత్నాలను దాటుకుని ఇంతవరకూ చేరిన నా ప్రయాణం ఈ కథలో కనపడుతుంది’ అని అన్నారు.
‘సంగారెడ్డికి వెళ్లి జగ్గారెడ్డి గురించి తెలుసుకున్నాను. ఇందులో జగ్గారెడ్డి పాత్రతో పాటు మంచి ప్రేమకథ కూడా ఉంటుంది. జగ్గారెడ్డి పాత్ర అద్దంలా ఉంటుంది. కానీ దాన్ని పగుల కొడితే అది ఒక ఆయుధం అవుతుంది. అదే ఆయన పాత్ర’ అని దర్శకుడు వడ్డి రామానుజం చెప్పారు. నిర్మాత జయలక్ష్మీ రెడ్డి మాట్లాడుతూ,’మా నాన్న జగ్గారెడ్డి జీవితంలో కొన్ని సంఘటనలు విన్నాను. వాటిని తెరమీద చూడబోతున్నాం అనే ఆలోచనే నన్ను ఎగ్జైట్‌ చేస్తుంది. సినిమా కూడా అందరికీ నచ్చే విధంగా ఉంటుంది’ అని తెలిపారు.

Subscribe for notification
Verified by MonsterInsights