వీళ్లు మనుషులేనా.. భర్త ఫిర్యాదు చేశాడని దారుణం.. తాలిబాన్‌ల మాదిరిగా పైపులతో..

Written by RAJU

Published on:

ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లు తమ దేశ ప్రజలకు విధించే శిక్షల గురించి రకరకాల ప్రచారాలు జరుగుతూ ఉంటాయి. ఆయా శిక్షలు అఫ్గనిస్తాన్‌లో పెద్ద వింత కాదు.. కానీ.. మిగతా దేశాల్లో జరిగితే మాత్రం అది ఖచ్చితంగా వింతే.. ఇలాంటి ఘటనే ఇప్పుడు భారత్‌లో చోటుచేసుకుంది. కర్నాటకలో అఫ్గనిస్తాన్‌ లాంటి శిక్షలు అమలు చేసి సంచలనం రేపారు కొందరు వ్యక్తులు. బెంగళూరులోని మసీదు ముందు ఓ మహిళ చేతులు కట్టేసి.. పైపులు, కర్రలతో చావబాదడం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆఫ్గనిస్తాన్‌లోని తాలిబన్ల లాగా కర్నాటకలోని దావణగెరె జిల్లాలో ఆరుగురు వ్యక్తులు రెచ్చిపోయారు. నడి రోడ్డుపై ఓ మహిళతో పాటు ఆమె బంధువులపై దాడి చేశారు.

వివాహేతర సంబంధం అనుమానంతో నస్రీన్ బాను అనే మహిళతో పాటు ఆమె బంధువులు నస్రీన్, ఫయాజ్‌ అనే వ్యక్తులపైనా బెంగళూరు తావరెకెరె జామియా మసీదు ముందు దాడి జరిగింది. అదే గ్రామానికి చెందిన ఆరుగురు వ్యక్తులు తాళ్లు, కర్రలు, ఇనుప పైపులతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు కర్నాటక పోలీసులు.

ఈ కేసుకు సంబంధించి మహ్మద్ నయాజ్, మహ్మద్ గౌస్ పీర్, చాంద్ పీర్, ఇనాయత్ ఉల్లా, దస్తగిర్, రసూల్‌ అనే ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. అనైతిక సంబంధం అనుమానంతో జామియా మసీదుకు నస్రీన్ బాను భర్త నుంచి ఫిర్యాదు అందింది. దాంతో.. ఆ ఫిర్యాదు విచారణ తర్వాత మహిళ తప్పు చేశారని షరియా కోర్టులో నిర్దేశించి శిక్ష విధించారు.

ఆపై చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న ఆయా వ్యక్తులు.. ఆ మహిళతోపాటు ఆమె కుటుంబ సభ్యులపైనా దారుణంగా దాడికి పాల్పడడం సంచలనం సృష్టించింది. ఈ ఘటనతో కర్నాటకలోని కాంగ్రెస్‌ సర్కార్‌పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights