వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వివేకా దారుణ హత్యకేసులో ఆరోపణలు ఎదు ర్కొంటూ.. ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న అక్యూజ్డ్(ఏ)-2 సునీల్ కుమార్ యాదవ్.. దాదాపు యూటర్న్ తీసు కున్నారు. నిన్న మొన్నటి వరకు వైసీపీ శిబిరానికి మద్దతుగా వ్యవహరించిన సునీల్.. తాజాగా ఇప్పుడు వైసీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలపైనే ఫిర్యాదు చేశారు. దీంతో సునీల్ వ్యవహారం ఈ కేసులో ఆసక్తి గా మారింది.
ఏం జరిగింది?

తాజాగా సునీల్ యాదవ్.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో తీసిన `హత్య` సినిమాలో తనతోపాటు తన తల్లిపాత్రలను అత్యంత దారుణంగా చిత్రీకరించారని తెలిపారు. అయితే.. ఈ సినిమాలోని కొన్ని భాగాలను వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని, దీంతో అందరూ తనను హంతకుడి మాదిరిగా చూస్తున్నారని, ఈ అవమానాలను భరించలేక పోతున్నానని.. పోలీసులకు తాజాగా ఫిర్యాదు చేశారు.
ఈ క్రమంలో ఆయన ‘వైఎస్ అవినాష్ అన్న యూత్’ అనే పేరుతో వాట్సాప్ గ్రూప్‌ను మెయింటెన్ చేస్తు న్న పవన్ కుమార్ సహా.. వైసీపీ కడప సోషల్ మీడియా ఇంచార్జ్.. పైనా ఫిర్యాదు చేశారు. దీంతో పులివెం దుల పోలీసులు ఇద్దరిపైనా కేసులు నమోదు చేశారు. పవన్ కుమార్‌ను ఏ-1గా, కడప సోషల్ మీడియా ఇంచార్జ్‌ను ఏ-2గా పేర్కొన్నారు. మానసికంగా వేదింపులకు గురి చేయడం.. సోషల్ మీడియాలో వైరల్ చేయడం వంటి ఐటీ చట్టాల కింద ఈ కేసులు నమోదు చేయడం గమనార్హం.