అలాంటిది విమానంలో పొగ తాగాలనే ధైర్యం ఎవరైనా చేస్తారా? కానీ తాజాగా నెట్టింట వైరల్ అవుతోన్న వీడియోలో మాత్రం ఓ మహిళ రచ్చ రచ్చ చేసింది. సిగరెట్ వెలిగించొద్దన్నందుకు ఏకంగా విమానాన్నే తగలబెట్టేందుకు ట్రై చేసింది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇస్తాంబుల్ నుంచి సైప్రస్ వెళ్లే విమానంలో ప్రయాణిస్తోన్న ఒక మహిళ, ఫ్లైట్ లోని వాళ్లందర్నీ భయభ్రాంతులకు గురి చేసింది. విమానంలో గందరగోళం సృష్టించింది. తోటి ప్రయాణీకుల్ని, విమాన సిబ్బందిని కొన్ని నిమిషాల పాటు బెంబేలెత్తించింది. మామూలుగా ఎర్రబస్సులోనే సిగరెట్ తాగనివ్వరు. అలాంటిది, విమానంలో ఏకంగా సిగరెట్ వెలిగించి గుప్పుమని పొగ ఊదింది. పొగ బయటకు వదలడంతో పరిస్థితిని గమనించిన విమాన సిబ్బంది ఒక్కసారిగా ఆమె దగ్గరకు చేరుకుని సిగరెట్ లాక్కునే ప్రయత్నం చేశారు. అయితే, సిగరెట్ ఇవ్వకపోవడమే కాదు, మరో చేతితో లైటర్ వెలిగించి ఏకంగా విమానాన్నే అంటించే ప్రయత్నం చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భర్త హత్యకు స్కెచ్.. సుపారీలిచ్చి మరీ మ*ర్డర్స్.. ప్రాణాలు తీస్తున్న పక్క చూపులు
ఆ గెలాక్సీలో ఆక్సిజన్! 1,340 కోట్ల కాంతి సం.ల దూరంలో
జనాలను పరుగులు పెట్టిస్తున్న ఎలుగుబంట్లు..
టాలీవుడ్ డైరెక్టర్ ఇంట్లో తీవ్ర విషాదం.. సానుభూతి తెలిపిన పవన్
హీరోయిన్ లే.. గీరోయిన్ లే…! కోర్టు నిర్ణయంతో దిమ్మతిరిగే షాక్