వినయ్ కుమార్, శ్రావణి మజ్జరి, అరవింద్ ముదిగొండ, నోమిన తార ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘కాలమేగా కరిగింది’. ఈ సినిమాను శింగర క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై మరే శివశంకర్ నిర్మించారు. శింగర మోహన్ దర్శకుడు. పొయెటిక్ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో శనివారం ఈచిత్ర ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఫణి, బిందు విద్యార్థులుగా ఉన్నప్పటి నుంచి ప్రేమికులు. అమాయకత్వం నిండిన స్వచ్ఛమైన ప్రేమ వారికి ఎంతో సంతోషాన్ని స్తుంది. తమ ప్రేమే లోకంగా జీవిస్తుంటారు ఇద్దరు. కలహాలే లేని ఈ ప్రేమ కథను కాలం విడదీస్తే ఆ జ్ఞాపకాలు వెతుక్కుంటూ హీరో ఫణి ప్రయాణం సాగిస్తాడు. బిందుతో కలిసి చదువుకున్న స్కూల్, తామిద్దరు మాట్లాడుకున్న ప్లేస్‌లు…అన్నింటిలో ప్రేమను గుర్తుల్ని పోగేసుకుంటాడు. ఈ ప్రేమికులు తిరిగి ఎలా కలిశారు అనేది ట్రైలర్‌లో ఆసక్తిని కలిగించింది. ఈ ప్లెజంట్ లవ్ స్టోరీని పొయెటిక్‌గా అందంగా రూపొందించారు దర్శకుడు శింగర మోహన్. గుడప్పన్ బ్యూటిఫుల్ మ్యూజిక్ ట్రైలర్‌లో ఆకట్టుకుంది. అంతేకాదు సినిమా చూడాలనే ఆసక్తిని ఈ ట్రైలర్ మరింతగా పెంచిందని అని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ చిత్రానికి రచన, దర్శకత్వం – సింగార మోహన్, డీవోపీ – వినీత్ పబ్బతి, ఎడిటర్ – రా యోగేష్, మ్యూజిక్ డైరెక్టర్ – గుడప్పన్.

విభిన్న పొయెటిక్ లవ్‌స్టోరీ.. –
Written by RAJU
Published on: