విప్రోకు టారిఫ్‌ కష్టాలు

Written by RAJU

Published on:

జూన్‌ త్రైమాసిక ఆదాయ అంచనా 3.5% తగ్గింపు

  • క్యూ4 లాభం రూ.3,569 కోట్లు

  • ఆదాయం రూ.22,504 కోట్లకు..

న్యూఢిల్లీ: ఐటీ సేవల కంపెనీ విప్రో మార్చి 31తో ముగిసిన 2024-25 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి రూ.3,569.6 కోట్ల ఏకీకృత నికర లాభం ఆర్జించింది. వార్షిక ప్రాతిపదికన ఇది 25.9 శాతం అధికం. ఆదాయం మాత్రం స్వల్పంగా పెరిగి రూ.22,504.2 కోట్లుగా నమోదైంది. డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికంతో పోలిస్తే క్యూ4లో నికర లాభం 6.43 శాతం, ఆదా యం 0.83 శాతం పెరిగాయి. కాగా, క్యూ4లో ఒక్కో షేరుపై ఆర్జన (ఈపీఎస్‌) రూ.3.4గా ఉంది. క్యూ3తో పోలిస్తే ఇది 6.2 శాతం పెరగగా.. వార్షిక ప్రాతిపదికన 25.8 శాతం వృద్ధి నమోదైంది. గడిచిన త్రైమాసికంలో విప్రో ఐటీ సేవల ఆదాయం (స్థిర కరెన్సీ ఆధారిత) అమెరికన్‌ కరెన్సీలో 259.65 కోట్ల డాలర్లుగా నమోదైంది. క్యూ3తో పోలిస్తే ఇది 1.2 శాతం, వార్షిక ప్రాతిపదికన 2.3 శాతం తగ్గిం ది. క్యూ4లో నిర్వహణ లాభాల మార్జిన్‌ వారి ్షక ప్రాతిపదికన 1.1 శాతం పెరిగి 17.5 శాతానికి చేరుకుంది. కాగా, 2024-25 ఆర్థిక సంవత్సరం మొత్తానికి విప్రో నికర లాభం వార్షిక ప్రాతిపదికన 18.9 శాతం పెరిగి రూ.13,135.4 కోట్లకు చేరగా.. ఆదాయం మాత్రం 0.74 శాతం తగ్గి రూ.89,088.4 కోట్లకు పరిమితమైంది.

  • గత కొన్ని త్రైమాసికాలుగా ఉద్యోగులను తగ్గించుకుంటూ వచ్చిన విప్రో.. క్యూ4లో నికరంగా 614 మందిని చేర్చుకుంది. క్యూ3లో 15.3 శాతంగా నమోదైన ఉద్యోగుల వలసల రేటు 15 శాతానికి తగ్గింది.

  • మార్చి 31 నాటికి విప్రో ఉద్యోగుల మొత్తం సంఖ్య 2,33,346గా నమోదైంది. 2023-24 ఆర్థిక సంవత్సరం చివరినాటికి ఉన్న 2,32,614 మందితో పోలిస్తే గడిచిన ఏడాది కాలంలో ఉద్యోగుల సంఖ్య 732 పెరిగింది.

  • మార్చి త్రైమాసికంలో కంపెనీ 395.5 కోట్ల డాలర్ల ఆర్డర్లను దక్కించుకుంది. గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే ఇది 13.4 శాతం అధికం. అందులో బడా డీల్స్‌ మాత్రం 48.5 శాతం పెరిగి 176.3 కోట్ల డాలర్లుగా నమోదయ్యాయి. 2024-25 ఆర్థిక సంవత్సరం మొత్తానికి మాత్రం ఆర్డర్లు 3.8 శాతం తగ్గి 1,430 కోట్ల డాలర్లకు పరిమితమయ్యాయి.

  • ప్రాంగణ నియామకాల ద్వారా గత ఆర్థిక సంవత్సరంలో ప్రణాళిక మేరకు 10,000 మంది వరకు ఫ్రెషర్లను నియమించుకున్నట్లు విప్రో చీఫ్‌ హ్యూమన్‌ రిసోర్సెస్‌ ఆఫీసర్‌ (సీహెచ్‌ఆర్‌ఓ) సౌరభ్‌ గోవిల్‌ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనూ ఫ్రెషర్ల నియామకాలు కొనసాగిస్తామన్నారు. ఈ సారి నిర్దిష్ట లక్ష్యమేమీ లేదని తెలిపారు. గతంలో లాగా ఆఫర్‌ లెటర్లు జారీ చేసి వారిని సంస్థలో చేర్చుకోవడాన్ని వాయిదా వేయకుండా అవసరమైన మేరకు నియామకాలు చేపట్టనున్నట్లు చెప్పారు.

  • ఈ జనవరి 17న ఒక్కో షేరుకు ప్రకటించిన రూ.6 మధ్యంతర డివిడెండ్‌నే 2024-25 ఆర్థిక సంవత్సరానికి తుది డివిడెండ్‌గా కూడా పరిగణించనున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది.

క్లయింట్లు

ఆచితూచి..

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జూన్‌తో ముగియనున్న తొలి త్రైమాసికంలో మాత్రం ఐటీ సేవల ఆదాయం 250.5-255.7 డాలర్లకు తగ్గవచ్చని కంపెనీ అంచనా వేసింది. 2024-25 క్యూ4తో పోలిస్తే ఆదాయం 1.5-3.5 శాతం వరకు తగ్గవచ్చని సంస్థ భావిస్తోంది. ట్రంప్‌ సుంకాల కారణంగా అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితులు పెరగడమే ఇందుకు కారణమని విప్రో సీఈఓ, ఎండీ శ్రీనివాస్‌ పల్లియా అన్నారు. ‘‘అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితుల నేపథ్యంలో క్లయింట్లు ఐటీ వ్యయాలపై ఆచితూచి నిర్ణయం తీసుకుంటున్నారు. నిలకడైన, లాభదాయక వృద్ధికి కట్టుబడి ఉంటూనే క్లయింట్లకు మరింత చేరువకావడంపై దృష్టిసారించాం’’ అన్నారు. ట్రంప్‌ సుంకాలు వాణిజ్య యుద్ధాలను తీవ్రతరం చేయడంతోపాటు అమెరికా ఆర్థిక వ్యవస్థను మాంద్యంలోకి నెట్టవచ్చన్న భయాలున్నాయి. ఈ పరిణామం అమెరికన్‌ కంపెనీల ఐటీ వ్యయ నిర్ణయాలపై ప్రభావం చూపవచ్చని, ఐటీ సేవలకు డిమాండ్‌ తగ్గవచ్చన్న అంచనాలున్నాయి. విప్రోకు అధిక ఆదాయం అమెరికా మార్కెట్‌ నుంచే సమకూరుతోంది.

ఇవి కూడా చదవండి:

WhatsApp Security: మీ వాట్సాప్ అకౌంట్ హ్యాక్ అయిందా..ఇలా ఈజీగా మళ్లీ యాక్సెస్‌ పొందండి..

Scam Payments: మార్కెట్లోకి నకిలీ ఫోన్ పే, గూగుల్ పే యాప్స్.. జర జాగ్రత్త..

Bill Gates: వారానికి మూడు రోజేలే పని..బిల్ గేట్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..

iPhone like Design: రూ.6 వేలకే ఐఫోన్ లాంటి స్మార్ట్‌ఫోన్‌.. ఫీచర్లు తెలిస్తే షాక్ అవుతారు..

Monthly Income: 50 ఏళ్ల తర్వాత నెలకు రూ.లక్ష కావాలంటే ఎంత సేవ్ చేయాలి, ఎన్నేళ్లు చేయాలి

Read More Business News and Latest Telugu News

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights