అవేంటో చూద్దాం. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏప్రిల్ 1, 2025 నుండి అమలు చేయనున్న రూపే డెబిట్ సెలెక్ట్ కార్డ్‌కు సంబంధించి పెను మార్పులే చేయబోతోంది. ప్రజల ఆధునిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ కార్డును రూపొందించారు. ఇందులో ప్రయాణం, ఫిట్‌నెస్, వెల్నెస్, ఇతర అవసరాలు కూడా ఉన్నాయి. విమానాశ్రయ లాంజ్ యాక్సెస్, బీమా కవర్‌కు సంబంధించిన మార్పులు కూడా ఉంటాయి. బ్యాంకులు కూడా ఏప్రిల్ 1 నుంచి కొన్ని కొత్త నిబంధనలు తీసుకురాబోతున్నాయి. ఎస్‌బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇతర బ్యాంకులు కూడా తమ కనీస బ్యాలెన్స్ నియమాలను మార్చబోతున్నాయి. బ్యాంకు ఖాతాల్లో మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెన్ చేయకపోతే జరిమానా చెల్లించాల్సి రావచ్చు. అలాగే, చాలా బ్యాంకులు తమ ఏటీఎం ఉపసంహరణ విధానాన్ని మార్చడానికి కూడా సిద్ధమయ్యాయి. ప్రతి నెలా ఇతర బ్యాంకుల ATMల నుండి లావాదేవీలకు నెలకు మూడు ఉచిత ఉపసంహరణలకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఈ పరిమితికి మించి ఉపసంహరణలకు ప్రతి లావాదేవీకి రూ.20 నుండి రూ.25 వరకు అదనపు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. లావాదేవీ భద్రతను పెంచడానికి, అనేక బ్యాంకులు పాజిటివ్ పే సిస్టమ్ ను ప్రవేశపెడుతున్నాయి. రూ.5,000 కంటే ఎక్కువ చెక్కు చెల్లింపులకు ఈ వ్యవస్థకు ధృవీకరణ అవసరం.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈ అంకుల్ సైక్లింగ్ చూస్తే అవాక్కవ్వాల్సిందే.. నెట్టింట వీడియో వైరల్
అర్ధరాత్రి మిస్టరీ మహిళ సంచారం.. డోర్‌బెల్స్ మోగిస్తుండటంతో జనంలో భయం
భార్య వేధింపులతో నరకం చూస్తున్నా.. కాపాడండి బాబోయ్