– మాజీ ఎమ్మెల్సీ పిజె.చంద్రశేఖరరావు
– ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ‘అంబేద్కర్ ఆలోచనలు-కార్మిక చట్టాలు- నాలుగు లేబర్ కోడ్స్’ అనే అంశంపై సదస్సు
నవతెలంగాణ-హిమాయత్ నగర్
విద్యుత్ సంస్థల స్థాపనకు రూపకల్పన చేసిన గొప్ప వ్యక్తి డాక్టర్ బీఆర్.అంబేద్కర్ అని మాజీ ఎమ్మెల్సీ పి.జె.చంద్రశేఖరరావు అన్నారు. అంబేద్కర్ జయంతిని పురస్కరిం చుకుని సోమవారం హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లోని ఏఐటీయూసీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు ఎండి.యూసుఫ్ అధ్యక్షతన ‘అంబేద్కర్ ఆలోచనలు-కార్మిక చట్టాలు- నాలుగు లేబర్ కోడ్లు’ అనే అంశంపై రాష్ట్ర సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. అంబేద్కర్ ఆర్థికవేత్త, సామాజికవేత్త, పేదల పెన్నిధి అని అన్నారు. బడుగు బలహీన వర్గాలు, దళితులు, కార్మికులు, మహిళలకు రాజ్యాంగ ప్రాథమిక హక్కులు కావాలని పోరాటాలు, ఉద్యమాలు చేశారని గుర్తు చేశారు.
కులనిర్మూలన అనే గ్రంథం రాసి కొలంబియా విశ్వవిద్యాలయం లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, కామర్స్, పొలిటికల్ సైన్స్‌లో డాక్టరేట్లు పొందిన మేధావి అంబేద్కర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్ కుమార్, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.బాలరాజు, ఉప ప్రధాన కార్యదర్శి ఎం.నరసింహ, ఉపాధ్యక్షులు పి.పేంప్రావని, కార్యదర్శి కరుణ కుమారి, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పానుగంటి పర్వతాలు, మేడ్చల్ జిల్లా కార్యదర్శి వి.శ్రీనివాస్, అధ్యక్షులు కె.రామస్వామి, వర్కింగ్ ప్రెసిడెంట్ శేఖర్ రెడ్డి, హైదరాబాద్ జిల్లా నాయకులు పి.వెంకటయ్య, బొడ్డుపల్లి కిషన్ తదితరులు పాల్గొన్నారు.